ప్రతి ఆడబిడ్డ జీవితంపై ఎన్నో ఆశలు, కోరికలు పెట్టుకుంటుంది. పెళ్లి విషయంలో తమకు కాబోయే భర్త గురించి ఎన్నో కలలు కంటారు. అలా తాము కన్న కలలను నిరవేరితే వారు ఎంతో సంతోషిస్తారు. కానీ ఓ యువతి విషయంలో మాత్రం విషాదం చోటు చేసుకుంది. కాళ్ల పారాణి ఆరకముందే కాటికి వెళ్లింది.
ప్రతి ఒక్క ఆడబిడ్డ జీవితంపై ఎన్నో ఆశలు, కోరికలు పెట్టుకుంటుంది. ముఖ్యంగా పెళ్లి విషయంలో తమకు కాబోయే భర్త గురించి ఎన్నో కలలు కంటారు. అలా తాము కన్న కలలను నిరవేరితే అమ్మాయిలు ఎంతో సంతోషిస్తారు. కానీ కొందరు విషయంలో దేవుడు చిన్నచూపు చూస్తాడు.. అన్ని ఇచ్చాడు.. అని సంతోష పడే లోపే.. విషాదం నింపుతాడు. తాజాగా ఓ యువతి విషయంలో అదే జరిగింది. తన బాల్య స్నేహితుడినే ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంది. కాళ్ల పారాణి ఆరక ముందే ఆ యువతి తిరిగి రాని లోకలాకు వెళ్లింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…
నిజామాబాద్ జిల్లా హమాల్ వాడికి చెందిన కూన రమ్శ్ కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమార్తె పూర్ణిమ(26)ను విశాల్ అనే వ్యక్తి ఇచ్చి గతేడాది డిసెంబర్ 18న వివాహం జరిపించారు. చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న వీరిద్దరు ఒకరినొకరు ప్రేమించి, పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. పూర్ణిమ టీసీఎస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా పనిచేస్తుండగా, భర్త విశాల్ నిజామాబాద్ లో కన్‌స్ట్రక్షన్ బిల్డర్ గా స్థిరపడ్డారు. ఈ నవదంపతులు ఇద్దరు ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు.
ఈ దంపతులు ఇద్దరు నిజామాబాద్ లోని సుభాష్ నగర్ లో ఓ అపార్ట్ మెంట్ లో ఐదో అంతస్తులో నివాసం ఉంటున్నారు.ఈక్రమంలో గురువారం ఐదో అంతస్తు బాల్కానీ నుంచి పూర్ణమ కిందపడి దుర్మరణం చెందింది. ఉదయం 11 గంటల సమయంలో బ్రేక్ ఫాస్ట్ కోసం వంట పాత్రలు కోసం బాల్కనీకి వెళ్లారు. అక్కడి నుంచి కాలు జారి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో పూర్ణిమ తలకు బలమైన గాయలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతురాలి కుటుంబీకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పూర్ణమ దంపతలు మధ్య ఎలాంటి తగాదాలు లేవని కుటుంబీకులు తెలిపారు. నవ వధువు మృతితో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. తొలుత ఆత్మహత్యగా భావించిన పోలీసులు ఆ తరువాత జరిగిన పూర్తి విచారణతో అసలు విషయం బయటకు వచ్చింది. ప్రమాదవశాత్తు కాలు జారి ఆమె ఐదో అంతస్తు నుంచి పడినట్లు పోలీసులు నిర్థారించారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.