ఈ మధ్యకాలంలో కొందరు చిన్న చిన్న విషయాలకు క్షణికావేశంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొత్తచీర కొనివ్వలేదని భార్య, చెప్పిన మాట వినలేదని భర్త ఇలా మాట్లాడుకుంటే సమిసిపోయే విషయాలకు నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. అచ్చం హైదరాబాద్ లో జరిగిన ఇలాంటి ఘటనలోనే ఓ భర్త భార్య చికెన్ వండలేదని ప్రాణాలను తీసుకున్నాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకే వెళ్తే.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ లో ఓ భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. అయితే భర్త హైదరాబాద్ లో ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అయితే ఈ నెల 25న సాయంత్రం మద్యం తాగి కోడి మాంసం తీసుకుని భర్త ఇంటికెళ్లాడు. వస్తూ రాగానే భార్యకిచ్చి వండమని చెప్పాడు. కుమార్తెకు ఆటలమ్మ సోకడంతో ఇంట్లో చికెన్ వండకూడదని భార్య భర్తకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది.
ఇది కూడా చదవండి: పట్టపగలే.. బస్తా నిండా నగలు.. 7 నిమిషాల్లో కోటిన్నర దోచేశారు!
ఎంత చెప్పినా వినిపించుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య కాస్త వివాదం రాజుకుంది. మద్యం మత్తులో భర్త ఆ తర్వాతి రోజు యాసిడ్ తాగి ఇంటికొచ్చాడు. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చివరికి భర్త ప్రాణాలు కోల్పోయాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.