హిందువులు ఘనంగా జరుపుకుని పండుగల్లో శ్రీరామ నవమి ఒక్కటి. ఈ పండుగ రోజున అన్ని రామాలయాల్లో శ్రీ సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహిస్తారు.ఇక భద్రాచలంలో జరిగి కొందడరాముడు కల్యాణ మహోత్సవం అంగరంగవైభవంగా జరుతుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మతసామరస్యానికి ప్రతీకగా దర్గాలో కూడా సీతాముల కల్యాణం నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని ఓ దర్గాలో ముస్లింలు.. రాములోరి కల్యాణం నిర్వహించి మత సామస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారు.వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని సత్యనారాయణపురంలోని హజరత్ నాగుల్ మీరా మౌలాచాన్ దర్గాలో ఆదివారం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. రామ, లక్ష్మణం, భరత, శతృఘ్నల విశేషాలను రామాయణ ఘట్టాలను పురోహితులు వివరిస్తూ కల్యాణం కొనసాగించారు. మాలిక్ లక్ష్మీనారాయణ,దుర్గా సభ్యులు తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
గత 18 ఏళ్లుగా నాగుల్ మీరాకు పూజలు, ఉర్సు ఉత్సవాలు చేయడం ఈ దర్గా ప్రత్యేకత. రాజకీయాల కు అతీతంగా పలు పార్టీల ప్రముఖులు, అధికారులు దర్గాను దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ దర్గాలోని మాలిక్ సీతారాముల కల్యాణాన్ని హిందూ సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. ఈ వేడుకల్లో హిందూ, ముస్లిం కుటుంబాలు పాల్గొన్నాయి. సోమవారం శ్రీరామ పట్టాభిషేకాన్ని కూడా నిర్వహించనున్నారు. మరి.. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన దర్గాలోని సీతారాముల కల్యాణంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.