ఈ మద్య కొంతమంది లగ్జరీ జీవితాలకు అలావాటు పడి ఈజీ మనీ కోసం తప్పుడుబాటలో నడుస్తున్నారు. ఇందుకోసం వ్యభిచారం వృత్తిగా ఎంచుకుంటున్నారు. పెద్ద పెద్ద నగరాల్లో హూటళ్ళు, లాడ్జీలు, బ్యూటీ పార్లర్ లు, స్పా సెంటర్స్ ని కేంద్రంగా చేసుకొని గుట్టుగా హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పైకి పెద్దమనుషుల్లా చెలామని అవుతున్నప్పటికీ కొంత మంది కేటుగాళ్ళు వ్యభిచార దందాల్లో కోట్లు సంపాదిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను రప్పించి ఆన్ లైన్ నెట్ వర్క్ తో ఈ దందాని నిర్వహిస్తున్నారు.
ఉద్యోగాల కోసం వచ్చిన అమ్మాయిలు, ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆడవారు.. భర్త నుంచి దూరమైన వారు, లగ్జరీ గా బతకాలని భావించే అమ్మాయిలను టార్గెట్ గా చేసుకొని వ్యభిచార వృత్తిలోకి లాగుతు అడ్డగోలుగా డబ్బు సంపాదిస్తున్నారు. ఇలాంటి దందాలు ఇటీవల హైదరాబాద్ లో మరీ ఎక్కువ అయ్యాయి. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేసి నిర్వాహకులను అరెస్ట్ చేస్తున్నప్పటికీ మళ్లీ మళ్లీ పునరావృతం అవుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ లో స్పా సెంటర్ పేరుతో వ్యభిచార రాకెట్ నడిపిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పంజాగుట్ట పోలీసులు.
గత కొంత కాలంగా సోమాజిగూడ లో పైకి నేచురల్ స్పా సెంటర్ అని చెబుతూ.. ఎవరికీ తెలియకుండా లోపల వ్యభిచారం నడిపిస్తున్నట్లు గా పక్కా సమాచారం రావడంతో వెంటనే దాడి నిర్వహించి సబ్ ఆర్గనైజర్, ఇద్దరు విటులను అరెస్ట్ చేసినట్లు ఏఎస్సై బి దుర్గారావు తెలిపారు. ఆ సమయంలో ముఖ్య నిర్వాహకుడు తప్పించుకుపారిపోయాడని.. అతన్ని కూడా త్వరలోపట్టుకుంటామని అన్నారు పోలీసులు. ఇద్దరు మహిళలను రెస్క్యూ హూం కి తరలించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.