దేవుడు అంటే ఎవరికైనా భయం, భక్తి ఉంటాయి. కానీ.., ఈ మద్య కొంత మంది కేటుగాళ్లు దేవుడి గుడికే కన్నాలు వేస్తున్నారు. హూండీలు ఎత్తుకు వెళ్లడం.. విగ్రహాలు చోరీ చేయడం లాంటివి చేస్తున్నారు. కానీ.., ఇరవై రోజుల క్రితం ఇలానే దేవుడి విగ్రహాలను ఎత్తుకెళ్లిన దొంగలు తిరిగి ఆ విగ్రహాలను తెచ్చి పూజారి చేతికే ఇవ్వడం, ఇచ్చే సమయంలో హనుమంతుల వారి స్మరణ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం కందకుర్తి రామాలయంలో జనవరి 7న కందకుర్తి రామాలయం లో శ్రీరాముడు సీతల పంచాలోహ 20 కేజీల విగ్రహాం, మరో ఐదు కేజీల రాగి విగ్రహాలు, వెండి కిరాలు దొంగలు దోచుకేళ్లారు. ఈ క్రమంలోనే గుడి పూజారి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది.
పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకొని 20 రోజులుగా మహారాష్ట్ర, కర్ణాటకలో పాత నేరస్థులపై నిఘా పెట్టి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు. సీసీ కెమెరాల ఫుటెజీని పరిశీలించి దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు. అయితే.. అనుహ్యాంగా దేవుడి విగ్రహాలు ఆలయంలో ప్రత్యక్షమయ్యాయి. పుష్యమాస అమావాస్య రోజున గోదావరి ఒడ్డున అన్నదాన కార్యక్రమం చేపట్టనున్న నేపథ్యంలో గుర్తుతెలియని వ్యక్తులు ఈ నెల 25న మహారాష్ట్ర వైపు నుంచి ఆటోలో బియ్యం బస్తాలు, ఇతర సామగ్రి తీసుకొచ్చి ఇక్కడి నిర్వాహకులకు అందించి వెళ్లిపోయారు. అయితే.. వాటిని తీసుకున్న పూజారి బిర్జు మహారాజ్ జోషి ఆ ఆహార పదార్ధాలను గుడిలోనే భద్రపరిచారు.
ఇది చదవండి: కేంద్ర బడ్జెట్ పై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు!
ఫిబ్రవరి 2న గుడిలో అన్నదానం ఉన్న నేపథ్యంలోనే పూజారి ఆ ప్యాకేజీలను విప్పి చూశాడు. వీటిలో ఒక సంచిలో బియ్యం ఆహార పదార్ధాలు ఉండగా, మరో బ్యాగ్ లో 3 అట్ట డబ్బలు ప్యాక్ చేయబడిఉన్నాయి. అందులో ఒక అట్ట డబ్బా విప్పి చూడగా మొదటి డబ్బాలో సీత రాముల ఉత్సవ విగ్రహం ఉండడంతో పూజారి సైతం ఆశ్చర్యపోయాడు. పోయాయి అనుకున్న విగ్రహాలు మళ్ళీ గుడిలో ప్రత్యక్షం అవ్వడంతో ఆ విషయాన్ని పోలీసులకి తెలియజేశాడు. గ్రామానికి చేరుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. సంఘటనపై స్పందించిన పోలీసులు విగ్రహాలు ఎవరు ఎత్తుకెళ్లారు. తిరిగి ఎందుకు తీసుకువచ్చారనే దానిపై విచారణ జరుపుతున్నామని చెబుతున్నారు. కానీ.., బ్యాగులను తెచ్చి ఇచ్చిన వ్యక్తులు హనుమ నామాన్ని జపిస్తూ ఉండటంతో ఇదంతా ఆ ఆంజనేయుడి పనే.. ఆయనే ఆ దొంగలకి కలలో కనపడి బుద్ది చెప్పి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు మాత్రం కేసు విచారణ కొనసాగుతుందని తెలియజేశారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.