వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఇటీవలే వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్తి కోసం వివేక హత్య జరగలేదంటూ ఆమె కామెంట్స్ వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కౌంటర్ ఇచ్చాడు.
వైఎస్ వివేకానంద రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఈ హత్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో సహా అనేక మంది వివిధ వ్యాఖ్యలు చేశారు. అలానే ఇటీవల వైఎస్ షర్మిల కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన ఇప్పటికే తన పేరున ఉన్న ఆస్తులను సునీత పేరు మీదే ఎప్పుడో రాశారని ఆమె తెలిపారు. ఆయన హత్యలో సునీత ప్రమేయం లేదని, అలానే ఆయన హత్యపై కొన్ని మీడియా ఛానల్ ఇష్టానుసారంగా రాస్తున్నాయని ఆమె తెలిపారు. ఆమె వ్యాఖ్యలపై వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ్ కౌంటర్ ఇచ్చాడు.
దివంగత నేత, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఓ వైపు సీబీఐ అధికారులు కేసు దర్యాప్తును ముమ్మరంగా సాగిస్తున్నారు. మరోవైపు రాజకీయంగా వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. అలానే వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కీలక కూడా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వివేకా ఆస్తులన్నీ కూడా సునీత పేరు మీద ఎప్పుడో వీలునామా చేశారని స్పష్టం చేశారు. అలానే ఈ హత్యతో సునీతు ఎలాంటి సంబంధం లేదని ఆమె తెలిపారు.
ఆస్తుల కోసం తన చిన్నాన్నను హత్య చేయలేదని చెప్పుకొచ్చారు. ఆయన హత్యకు గల కారణాల ఇవే అంటూ పలు మీడియా ఛానెళ్లలో ఇష్టానుసారంగా వార్తలు ప్రసారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయన వ్యక్తి గురించి విషప్రచారం చేయటాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. తాజాగా ఆమె వ్యాఖ్యలు వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కౌంటర్ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ..”ఒక పార్టీ అధినేత్రి అయిన వైఎస్ షర్మిల.. ఆలోచన లేకుండా మాట్లాడతారని లేను ఊహించలేదు. ఆస్తులన్ని ఆమె పేరునే ఉన్నాయి. కాబట్టి హత్య చేయాలనే ఆలోచన సునీతకు ఎలా ఉంటుందని షర్మిల అన్నడం కరెక్ట్ కాదు.
ఎందుకు ఆయన బతికున్నప్పుడు ఒక వేళ నిజంగా వీలునామా రాసి ఉంటే.. అప్పటికే ఆయన బతికి ఉన్నారు కాబట్టి.. ఆయనకు ఏదైన సమస్య వచ్చి ఉండే, మనస్సు మరో వీలునామా మార్చే అవకాశం ఉంది కదా?. ఏదో ఒక కారణంతో ఆయన ఈ వీలునామా మార్చేలోపు హత్యకు మోటివేషన్ అయితే ఉండే అవకాశం ఉంది. అది జరిగిందా? లేదా నేను అనడం లేదు. అది దర్యాప్తు సంస్థలు అధికారులు బయటపెడతారు. అచ్చం ఇలాంటి కేసులే దేశంలో కొన్ని జరిగాయి” అంటూ ఆర్జీవీ అన్నారు. మరి.. రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.