Letter To Minister KTR Asking Medical Aid: సాధారణంగా పిల్లలకు కష్టం వస్తే.. తల్లిదండ్రులు విలవిల్లాడాతారు. వారిని కాపాడుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తారు. తమ ప్రాణాలు అడ్డువేసి మరి బిడ్డలను కాపాడుకుంటారు. బిడ్డల భవిష్యత్తు కోసం నిత్యం శ్రమిస్తారు. మరి పిల్ల బాగు కోసం ఇంతలా ఆలోచించే తల్లిదండ్రులకే కష్టం వస్తే.. ఆదుకునేవారు లేక.. ఎవరిని సాయం అడగాలో తెలియక.. ఆ పసి ప్రాణాలు ఎంత విలవిల్లాడతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇదుగో ఇలాంటి కష్టాన్నే ఎదుర్కొంటున్నారు ఇద్దరు చిన్నారులు. తమ తండ్రిని కాపాడమని కోరుతూ.. మంత్రి కేటీఆర్‌కు లేఖ రాశారు. ఆ వివరాలు..
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూరు గ్రామానికి చెందిన మామిండ్ల శ్రీనివాస్ ఉపాధి నిమిత్తం కొన్నేళ్ల క్రితం సిరిసిల్ల పట్టణానికి వచ్చాడు. పట్టణంలోని తుక్కారావుపల్లెలో కుటుంబంతో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. శ్రీనివాస్‌కు తల్లి మల్లవ్వ, భార్య మంజుల, కూతుళ్ళు రుచిత, సునీత, కుమారుడు బాబు ఉన్నారు. శ్రీనివాస్ హమాలి కూలీగా పనిచేస్తుండగా, మంజుల బీడీలు చుడుతూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటుంది.
ఇది కూడా చదవండి: నన్ను చదివించండి సర్.. బాలుడి కన్నీళ్లు చూసి చలించిపోయిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఈక్రమంలో శ్రీనివాస్ కొంత కాలం క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు బయట అప్పు చేసి మరి అతడికి వైద్యం చేయించారు. అయినా శ్రీనివాస్ కోలుకోలేదు. ఇదిలాఉంటే గత నాలుగు నెలలుగా శ్రీనివాస్ ఆరోగ్యం మరింత క్షిణిస్తూ వస్తుంది. శ్రీనివాస్ ఆరోగ్యం రోజురోజుకు క్షీణించి.. చివరకు సొంత పనులు కూడా చేసుకోలేని విధంగా మంచానికే పరిమితం అయ్యాడు.
కుటుంబ పెద్దగా బిడ్డల బాగోగులు చూడాల్సిన శ్రీనివాస్ ఇలా తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆ కుటుంబానికి తీరని కష్టంగా మారింది. ఇక మంజుల బీడీలు చుట్టగా వచ్చిన కాస్త ఆదాయంతోనే ఇల్లు గడుస్తుంది. ఇక ఇంటికి పెద్ద దిక్కై కుటుంబాన్ని నడిపించాల్సిన మనిషి అనారోగ్యంతో ఆచేతనమై కళ్ళముందు కదలలేని స్థితిలో మిగిలాడు. ఇంటి అద్దెలతోపాటు కుటుంబం గడిచే దారిలేక కుటుంబ సభ్యులందరు నిస్సహాయంగా ఉండిపోయారు.
ఇది కూడా చదవండి: Newly Married Women: కొత్తగా పెళ్లైన మహిళలు గూగుల్ లో వెతికేది ఇదేనట!
దాతలెవరైనా స్పందించి తమకు ఆర్ధిక సహాయం చేస్తే తమ తండ్రి తిరిగి కోలుకుంటాడని ఆ చిన్నారులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు లేఖ రాసిన ఆ చిన్నారులు తమ తండ్రికి వైద్య సహాయం అందేలా చూడాలని కోరారు. చిన్నారులకొచ్చిన కష్టంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ప్రభుత్వ టీచర్లకు కేసీఆర్ సర్కార్ షాక్.. ఇకపై ఆస్తి వివరాలు ఇవ్వాల్సిందే!