తెలంగాణ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది మొదటి సారి తెలంగాణ పర్యటనకు వచ్చారు ప్రధాని. ఈ సందర్భంగా సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ని ప్రారంభించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ప్రసంగించారు.
నేడు తెలంగాణ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు పాల్గొన్నారు. తన పర్యటనలో మొత్తం రూ.11,355 కోట్ల విలువైన అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ని ప్రారంభించారు. రిమోట్ ద్వారా శిలాఫలకాలు ఆవిష్కరించిన ప్రధాని. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ అభివృద్ది మరింత వేగవంతం చేసే అదృష్టం నాకు కలిగింది. రూ.7,865 కోట్ల విలువైన హైవే పనులకు శంకుస్థాన చేశాం. తెలంగాణ , ఏపీని కలిపే వందేభారత్ ఎక్స్ ప్రెస్ ని ప్రారంభించాం. మహబూబ్ నగర్ – చించోలి రహదారి, కల్వకుర్తి-కొల్లాపూర్ రహదారి పనులు చేట్టాం. భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి తిరుమల వెంకన్న వరకు ట్రైన్ వేశాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో నేషనల్ హైవేలు రెట్టింపు అయ్యాయి. రూ. 35,000 కోట్లతో తెలంగాణ లో రోడ్ల అభివృద్ది పనులుకు ఖర్చు చేశాం. నాలుగు హైవే ప్రాజెక్ట్ పనులకు శ్రీకారం చుట్టాం.. తెలంగాణలో రూ. 11 వేల కోట్లతో పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశాం. ఒకే రోజు 13 ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభించిన ఘనత మా ప్రభుత్వానికే దక్కుతుంది. తెలంగాణ దేశ అభివృద్దిలో భాగమయ్యేలా చేశామన్నారు. రూ.5 లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాం అలాగే.. 5 లక్షల మంది స్ట్రీట్ వెండార్స్ కి లోన్స్ లభించాయి. చిన్న రైతులకు పీఎం కిసాన్ నిధి నుంచి డబ్బు అందుతుంది.
కేంద్రంతో తెలంగాణ ప్రభుత్వం కలిసి రావడం లేదు.. కొందరు వారి స్వలాభం మాత్రంమే చూసుకుంటున్నారు. అవినీతి పరుల కుటుంబం రాష్ట్రాన్ని దోచేస్తుంది. కేంద్రం నుంచి ప్రాజెక్టులు వస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు. కొంతమంది తెలంగాణ అభివృద్దికి అడ్డంకిగా మారారు. వ్యవస్థపై కుటుంబవాద శక్తులు తమ నియంత్రణను కల్పోయేందుకు ఇష్టపడటం లేదు. తమ స్వార్థం కోసం అన్ని వ్యవస్థలను నియంత్రిస్తున్నారు. ఇలాంటి వారి నుంచి తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజల ఆంక్షలు నెరవేర్చడమే మా క్ష్యం. అవినీతి, కుటుంబ పాలన వేర్వేరు కాదు.. అవినేతి పరులను ఏరివేసేందుకు చట్టం తన పని తాను చేసుకోవల్సిన అవసరం ఉందా లేదా? అని ప్రశ్నించారు.
కొంతమంది తమ పట్టు నిలుపుకోవడం కోసం ఏకంగా విచారణ సంస్థలను బెదిరిస్తున్నారు. ప్రతి ప్రాజెక్ట్ లోనూ కుటుంబ స్వార్తం చూసుకుంటున్నారు. వారంతా సొంత కుటుంబం కోసమే పనిచేస్తున్నారు.. తెలంగాణ ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా నేను చేస్తున్న పోరాటంపై అందరూ కలిసి కోర్టుకెళ్లారు. కానీ కోర్టు వాళ్లకు చివాట్లు పెట్టింది. నాపై పోరాటానికి అన్ని శక్తులు ఏకమయ్యాయి.. కుటుంబ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కావాలని అన్నారు ప్రధాని మోదీ. ఇక్కడ కొంతమందికి నీతీ.. నిజాయితీతో పోరాడే వాళ్లు అంటే అస్సలు గిట్టడం లేదు. ఎవరు వ్యతిరేకించినా.. ఎన్ని శక్తులు అడ్డు వచ్చినా తెలంగాణ అభివృద్దికి కట్టుబడి ఉంటా అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.