అమెజాన్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు ఉందో అందరికి తెలుసు. అలాంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కంపెనీలో ఉద్యోగం సాధించడం అంటే మాటలు కాదు. ఎంతో కష్టపడాలి. ఇంటర్వ్యూలో మంచి ప్రతిభ కనబర్చాలి. ఎన్నో ఒడపోతలు దాటితే కానీ ఉద్యోగం సాధించలేం. పైగా అమెజాన్ లాంటి మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం అంటే.. ఇంగ్లీష్‌లో మంచి ప్రావీణ్యం ఉండాలి. ఇక ఇవన్ని ఉన్న ప్రతిభావంతులను కంపెనీ అస్సలు వదులుకోదు. కోట్ల రూపాలయ ప్యాకేజీ ఇచ్చి మరి కొలువులో చేర్చుకుంటుంది. ప్రస్తుతం అదే జరిగింది. వనపర్తి జిల్లా పానగల్ వాసికి.. అగ్రరాజ్యం అమెరికాలోని అమెజాన్ సంస్థలో ఏడాదికి 1.20 కోట్ల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగం లభించింది. ఆ వివరాలు.. పానగల్ మండలం, కేతేపల్లి గ్రామానికి చెందిన వంగూరు బాలీశ్వర్‌రెడ్డి, వసంతలక్ష్మి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. కానీ సరైన ఉపాధి లేకపోవడంతో.. కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చారు.
ఇది కూడా చదవండి: రూ.1.2 కోట్ల జీతం..! ట్రిపుల్ఐటీ చరిత్రలోనే రికార్డు సృష్టించిన విద్యార్థి..!
బాలీశ్వర్‌రెడ్డి దపంతులకు ఇద్దరు కుమారులు. వీరిలో రెండో కుమారుడైన అనీష్ కుమార్ రెడ్డి విద్యాభ్యాసం హైదరాబాద్‌లోనే సాగింది. ఈ క్రమంలో ఉన్నత చదువులు కోసం 2021 జనవరిలో అమెరికా వెళ్లాడు అనీశ్ కుమార్. అక్కడ మిస్సోరి విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌లో చేరారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో చదువు పూర్తి కాగానే.. అక్కడే అమెజాన్ సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి.. భారీ ప్యాకేజీతో కొలువు సాధించాడు. అమెజాన్‌లో టెక్నికల్ విభాగం టీంలీడర్ పోస్టులో నియమితులై బుధవారం ఉద్యోగంలో చేరినట్లు అనీష్‌కుమార్ తండ్రి బాలీశ్వర్‌రెడ్డి తెలిపాడు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: శభాష్ భావన! రైతు కూతురికి 40 లక్షల సాలరీతో జాబ్!