ఇప్పటివరకు మనుషులు ప్రాణాలు హరించిన గుండెపోటు.. ఇప్పుడు జంతువులను సైతం వదలడం లేదు. తాజాగా, హైదరాబాద్ నెహ్రూ జూపార్క్‌లో ఓ చీతా గుండెపోటుతో కన్నుమూసింది.
దేశంలో గుండెపోటు మరణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాలలో సైతం అలాంటి ఘటనలు అనేకం వెలుగుచూశాయి. జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ ఒకరు, గ్రౌండ్లో షటిల్ ఆడుతూ మరొకరు, పెళ్లి పీటల మీద ఇంకొకరు, పెళ్లి బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ యువకుడు.. విధుల్లో ఉన్న బస్ కండక్టర్, కాసేపట్లో పెళ్లనగా పెళ్లికూతురు.. ఇలా ఎక్కడిక్కడ.. ఎవరికి వారు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఇదిలావుంటే తాజాగా, హైదరాబాద్ నెహ్రూ జూపార్క్‌లో ఓ చీతా గుండెపోటుతో కన్నుమూసింది.
హైదరాబాద్ నెహ్రూ జూపార్క్‌లో మార్చి 25న అబ్దుల్లా(15) అనే మగ చీతా చనిపోయింది. దీనికి పోస్టుమార్టం చేసిన అధికారులు.. గుండెపోటుతో చనిపోయినట్లు నిర్ధారించారు. 2011లో సౌదీ రాజ కుటుంబీకులు జూను సందర్శించి, జూ నిర్వహణకు ముగ్ధులై 2012లో ఒక జత ఆడ, మగ చీతాలను బహుమతిగా ఇచ్చారు. అప్పుడు వీటి వయసు నాలుగేళ్లు. ఆడ చీతా(హీబా.) 12 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మృతి చెందగా.. అప్పటి నుంచి అబద్దుల్లా ఒంటరిగా ఉంటంది. అది కూడా నిన్న చనిపోయింది. ప్రస్తుతం నెహ్రూ జూపార్క్ లో చీతాలు లేకుండా పోయాయి. జంతువులను సైతం గుండెపోటు మరణాలు కబళిస్తుండటంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A 15-year-old male Cheetah gifted by the Saudi Prince a decade ago died of a heart attack at the Nehru Zoological Park in #Hyderabad. pic.twitter.com/nJcU8zf3NO
— IANS (@ians_india) March 26, 2023