దేశవ్యాప్తంగా అందరినీ కళ్లు చెమ్మగిల్లేలా చేసిన దుర్ఘటన సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్య. ఇంకా, ఆ నిందితుడు బయటే తిరుగుతున్నాడు. అతనిపై ఇప్పిటకే పోలీసులు రూ.10 లక్షల రివార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. స్థానికంగా ఉన్న బస్తీ వ్యక్తి ఒకరు అతనికి సహాయం చేస్తున్నట్లు సీసీ టీవీ ఫుటేజ్‌లో తెలుస్తోంది. ఈ అంశం ఇప్పుడు రాజకీయ, సామాజిక, సినీనటులు అందరూ స్పందిస్తున్నారు. పోలీసులు కూడా అలుపెరుగకుండా నిందితుడి జాడ కోసం గాలిస్తున్నారు. సజ్జనార్ ఆర్టీసీ ఉద్యోగులను కూడా అప్రమత్తం చేశారు. తాజాగా ఈ అంశంపై న్యాచురల్ స్టార్ నాని స్పందించారు.
‘ఆరేళ్ల చిన్నారి అత్యాచారం, హత్య కేసులో నిందితుడిని పట్టుకోవడంలో తెలంగాణ పోలీసులకు సమాచారం అందించి సహకరించండి. పట్టించిన వారికి రూ.10 లక్షల నగదు బహుమతి ప్రకటించబడింది’ అన్న తెలంగాణ పోలీసుల ట్వీట్‌ను నాని రీట్వీట్ చేశాడు. ‘బయట ఎక్కడో ఉన్నాడు.. ఉండకూడదు’ అంటూ నాని ట్వీట్ చేశాడు. ఆ నిందితుడు ఇంకా బయటే తిరుగుతున్నాడు. అతను బయట ఉండకూడదు. అందరూ అందుకు సహకరించండి అన్న కోణంలో నాని ట్వీట్ చేశాడు. నిందితుడి సమాచారం మరెందరికో చేరువయ్యేందుకు నాని తనవంతు ప్రయత్నం చేశాడు. ఇప్పటికే ఎందరో సినీ ప్రముఖులు చిన్నారి ఘటనపై సోషల్ మీడియా, పలు మాధ్యమాల్లో స్పందించారు. స్పందిస్తున్నారు.
బయటెక్కడో ఉన్నాడు
వుండకుడదు https://t.co/yyiuvM6HP1— Nani (@NameisNani) September 15, 2021