నగరంలో రోజు రోజుకీ మెట్రో ప్రయాణాలపై మక్కువ చూపిస్తున్నారు నగరవాసులు. ఎలాంటి ట్రాఫిక్ టెన్షన్ ఉండవు, సురక్షితమైన ప్రయాణంతో పాటు వేగంగా గమ్య స్థానాలకు చేరుస్తుండటంతో మెట్రో బాగా సక్సెస్ అయింది.. అందుకే విద్యార్థులు, ఉద్యోగస్తులు ఎక్కువగా మెట్రో ప్రయాణాలకు ప్రాధాన్య ఇస్తున్నారు.
హైదరాబాద్ మెట్రో రైళ్లకు రోజు రోజుకీ మంచి ఆదరణ పెరిగిపోతుంది. ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఉద్యోగస్థులు, విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారు.. కానీ నగరంలో మెట్రో సేవలు వచ్చిన తర్వాత ఆ ఇబ్బందులు కొంతమేరకు తొలగిపోయాయి. సకాలంలో గమ్యస్థానాలకు చేర్చడంలో తిరుగులేని నమ్మకాన్ని సోంతం చేసుకుంటున్నాయి మేట్రో రైళ్లు. అందుకే చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా మెట్రో రైళ్లో ప్రయాణం చేసేందుకు ఎక్కవగా ఆకస్తి కనబరుస్తున్నారు. దీంతో మెట్రో రైళ్లు ఫల్ కెపాసిటీతో ప్రయాణిస్తున్నాయి. తాజాగా మెట్రో ప్రయాణీకులకు ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే..
2017 లో హైదరాబాద్ లో ప్రారంభమైన మెట్రో సేవలు కొద్ది నెలల్లోనే ప్రయాణికుల మనసు దోచుకుంది. ఉదయం లేచిన మొదలు రాత్రి వరకు రోడ్డుపై ఎంత రద్దీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా.. సురక్షితమైన ప్రయాణంతో పాటు వేగంగా గమ్యస్థానాలకు చేరుస్తుండటంతో మెట్రో మంచి సక్సెస్ అయ్యింది. తాజాగా నగరలో మెట్రో ప్రయాణీకులకు ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ సంస్థ వారు సరికొత్త ఆఫర్ ని ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి ఆఫ్ పిక్ అవర్స్ ఆఫర్ అందుబాటులోకి తెస్తుందని.. సంస్థ ఎండీ, సీఈఓ కేవీబీ రెడ్డి తెలిపారు. ఈ ఆఫ్ పిక్ అవర్స్ ఆవఫర్ లో భాగంగా కాంటాక్ట్ లెస్ స్మార్ట్ కార్డు పై పది శాతం రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించారు.
ఉదయం 6 నుంచి 8 గంటల వరకు రాత్రి 8 నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు ఈ సందుపాయం ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలో మెట్రో ప్రయాణికులు శాతం ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో మెట్రో ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ఆఫర్ ని అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు కేవీబీ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం మూడు కారిడార్లలో 57 మెట్రో స్టేషన్ లతో కలిసి మొత్తం 69 కిలోమీటర్ల మేర మెట్రో రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ.. మెట్రో రైల్ రోజుకు 4.4 లక్షల మందిని తమ గమ్యస్థానాలకు చేరవేస్తోందని ఆయన తెలిపారు.