సాధారణంగా ప్రేమించిన వాడు మోసం చేస్తే.. తనకు న్యాయం చేయమని కోరుతూ యువతి.. ప్రియుడి ఇంటిముందు బైఠాయించే సంఘటనలనే ఇప్పటి వరకు చూశాం. కానీ తొలిసారిగా ఇందుకు భిన్నంగా.. ప్రియురాలి ఇంటి ముందు కూర్చుని.. నిరసన తెలుపుతున్న ప్రియుడిని చూడబోతున్నాం. ఇక ఈ సంఘటనలో అనేక ట్విస్టులు ఉన్నాయి. ప్రియురాలిని పెళ్లి చేసుకోవడం కోసం సదరు యువకుడు.. ఆమె తల్లిదండ్రులకు భారీగా నగదు.. బంగారం ఇచ్చాడు. అన్ని తీసుకున్న వాళ్లు.. అతడు ప్రేమించిన యువతికి వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని నిర్ణయించారు. దాంతో సదరు యువకుడు, యువతి ఇంటి ముందు కూర్చుని నిరసనకు దిగాడు. తనకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాడు. ఆ వివరాలు..
ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. లక్షట్టిపేటకు చెందిన ప్రవీణ్‌కు 2015లో ఓ హాస్టల్‌లో కమాటిగా పని చేస్తున్న యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని భావించారు. దాని గురించి తల్లిదండ్రులకు చెప్పారు. అయితే వారి కులాలా వేరు కావడంతో.. యువతి తల్లిదండ్రులు వీరి ప్రేమను అంగీకరించలేదు. ఈ క్రమంలో యువతికి మరో వ్యక్తికి పెళ్లి నిశ్చయం చేశారు. విషయం తెలుసుకున్న ప్రవీణ్.. యువతి ఇంటి ముందు కూర్చుని నిరసన తెలిపాడు.
ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. యువతి తల్లిదండ్రులు తమ పెళ్లి చేస్తామని చెప్పారని.. అందుకోసం వారికి 5 లక్షల రూపాయల నగదు, బంగారం కూడా ఇచ్చానని తెలిపాడు. సొమ్ము తీసుకుని.. ఇప్పుడు తనను మోసం చేస్తున్నారని.. ప్రస్తుతం తాను ప్రేమించిన యువతికి మరో వ్యక్తితో వివాహం నిశ్చయం చేశారని వాపోయాడు. తనకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ.. యువతి ఇంటి ముందు కూర్చుని నిరసన తెలిపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఇద్దరినీ స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.