భార్యాభర్తల మధ్య గొడవలు అనేది సర్వసాధారణం. ముఖ్యంగా ఆర్థిక, మద్యం వంటి విషయాల్లోనే దంపతుల మధ్య గొడవలు వస్తుంటాయి. అయితే కొందరు భర్తలు తాగొచ్చి భార్యను తిడతారు, కొడతారు. అలా చేసిన ఓ భర్తకు కోర్టు బుద్ధి చెప్పింది.
భార్యాభర్తల మధ్య గొడవలు అనేది సర్వసాధారణం. ముఖ్యంగా ఆర్థిక, మద్యం వంటి విషయాల్లోనే దంపతుల మధ్య గొడవలు వస్తుంటాయి. చాలా మంది భర్తలు తమ భార్యలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అయితే కొందరు భర్తలు తాగొచ్చి భార్యను తిడతారు, కొడతారు. అలానే మహిళలు కూడా కుటుంబం కోసమో, సమాజం, పరువు, పిల్లల కోసమో భర్త వేధింపులను మౌనంగా భరిస్తారు. అయితే పిల్లల్ను దూషిస్తే ఏ తల్లి ఊరుకోదు. అలానే తాజాగా కూతుర్ని అసభ్యకరంగా దూషిస్తూ దాడి చేసిన భర్త విషయంలో ఓ భార్య కోర్టు మెట్లు ఎక్కింది. ఈ నేపథ్యంలో కోర్టు సదరు భర్తకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
హైదరాబాద్‌లోని అడ్డగుట్టకు చెందిన రాజేష్, అంబిక భార్యభర్తలు. పెళ్లైన కొంతకాలం వరకు వారి సంసారం ఎంతో హాయిగా సాగింది. ఒకరిపై మరొకరు ప్రేమానురాగాలు చూపించుకున్నారు. ఈ దంపతులకు ఓ కుమార్తె జన్మించింది. అయితే రాజేష్ మద్యానికి బానిసగా మారాడు. దీంతో తరచూ మద్యం తాగి వచ్చి అంబికను వేధించే వాడు. రాజేష్ పెట్టే వేధింపులను అంబికా భరిస్తూ వచ్చింది. మద్యానికి బానిసైన రాజేష్ రోజూ తాగి వచ్చి భార్యతో పాటు కుమార్తెను అసభ్యకరంగా దూషించేవాడు. ఏప్రిల్ 13న కూడా భార్యను, కూతుర్ని దూషిస్తూ, వారిపై దాడి చేశాడు. ఇక భర్త వేధింపులు భరించలేక పోయిన అంబిక పోలీసులకు ఆశ్రయించింది.
తన భర్త పెట్టే వేధింపులను పోలీసులకు వివరించి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రాజే్‌షను అరెస్ట్ చేసి సికింద్రాబాద్ 15వ స్పెషల్ ఎంఎం కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఈ కేసుపై పూర్తి స్థాయిలో వాదోపవాదనలు విన్న న్యాయమూర్తి తుది తీర్పు ఇచ్చారు. అయితే న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుతో భర్త షాక్ గురయ్యాడు. రాజేష్ కు 7 నెలల సాధారణ జైలు శిక్షతో పాటు రూ. 1,100 జరిమానా విధించారు. తీర్పు అనంతరం రాజేష్ ను పోలీసులు చంచలగూడ జైలుకు తరలించారు. మరి.. భార్య, పిల్లలను వేధించే ఈ భర్తల విషయంలో కోర్టు ఇచ్చిన ఈ తాజా తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.