కేటీఆర్.. కేవలం తెలంగాణ వారికి మాత్రమే కాదు.. తెలుగు ప్రజలందరికి ఆయన సుపరిచితుడు. తెలంగాణ ఉద్యమ సమయంలో.. ఆయన తెర మీదకు వచ్చాడు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో.. తండ్రి కేసీఆర్‌తో పాటు కీలక పాత్ర పోషించాడు. ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత.. వచ్చిన ఎన్నికల్లో విజయం సాధించి.. మినిస్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక రాజకీయాల పరంగా మాత్రమే కాక.. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటారు కేటీఆర్. రాజకీయాల గురించి మాత్రమే కాక.. తన దృష్టికి వచ్చిన సమస్యలపై స్పందించడం.. మంచి విషయాలను ప్రశంసించడంలో ముందుంటారు కేటీఆర్. ఈ క్రమంలో తాజాగా కేటీఆర్‌కు సంబంధించిన కొన్ని అరుదైన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..
నేడు కేటీఆర్ పెళ్లి రోజు. 1976లో జన్మించిన కేటీఆర్.. అమెరికాలో ఎంబీఏ చేసిన అనంతరం అక్కడే కొన్నాళ్లు ఉద్యోగం చేసిన సంగతి తెలిసిందే. ఇక తెలంగాణ ఉద్యమం తీవ్రం అయిన సమయంలో.. 2006లో కేటీఆర్ ఉద్యోగానికి రాజీనామా చేసిన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2003 డిసెంబర్ 18న శైలిమను వివాహం చేసుకున్నారు. ఇవాళ వారి 19వ పెళ్లి రోజు. ఈ సందర్భంగా కేటీఆర్ పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.పెళ్లి కొడుకు గెటప్‌లో.. కేటీఆర్‌ని చూసిన నెటిజనులు.. రామన్న ఎంత అందంగా ఉన్నావ్ అని కామెంట్స్ చేస్తున్నారు. కేటీఆర్, శైలిమ దంపతులకు హిమాన్షు రావు, అలేఖ్య రావు ఇద్దరు సంతానం ఉన్న సంగతి తెలిసిందే. ఇక హిమాన్షు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటాడు.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రివర్యులు, మా అన్నయ్య-వదినమ్మ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు౼ శైలిమ గార్లకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు..💐 pic.twitter.com/LVU4rNboVN
— Thirupathi Bandari (@BTR_KTR) December 18, 2022