భార్యాభర్తల మధ్య నెలకొన్న తగాదాలు చిలికి చిలికి గాలి వానలా మారుతున్నాయి. అపార్థాల పెను విషాదాన్ని నింపుతున్నాయి. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. దానికి ఉదాహరణగా నిలిచింది జనగామ ఎస్సై కుటుంబం.
కుటుంబ కలహాలు కాపురాలను మంటగలుపుతున్నాయి. భార్యాభర్తల మధ్య నెలకొన్న తగాదాలు చిలికి చిలికి గాలి వానలా మారుతున్నాయి. అపార్థాల పెను విషాదాన్ని నింపుతున్నాయి. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. ఈ చర్యల వల్ల పిల్లలు అనాథలుగా మారుతున్నారు. సఖ్యత లేని కాపురం తాను చేయలేనని భావించిన భార్య మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంది. భార్య ఆత్మహత్యను జీర్ణించుకోలేని భర్త కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాగా, అతడు ఉన్నతమైన హోదాలో ఉన్న వ్యక్తి బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం గమనార్హం. జనగామ ఎస్సై, ఆయన భార్య ఇద్దరూ బలవంతంగా ప్రాణాలు తీసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది.
జనగామలో విషాదం నెలకొంది. భార్య భర్తల మధ్య గొడవలు రాచుకుని ప్రాణాలు తీసుకునేంత వరకు చేరాయి. మనస్పర్థల కారణంగా జనగామ ఎస్సై శ్రీనివాస్ భార్య స్వరూప గురువారం ఉదయం నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య చనిపోయిందని మనస్థాపం చెందిన ఎస్సై శ్రీనివాస్ కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇంట్లో తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భార్య చనిపోయిన తర్వాత.. ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆయన వెక్కివెక్కి ఏడుస్తున్న దృశ్యాలు వార్తా చాన్నళ్లలో ప్రసారమయ్యాయి. అంతలోనే ఆయన కూడా తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. అయితే కుటుంబ కలహాలే వీరి ఆత్మహత్యలకు కారణమయ్యాయని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.