ఈ మద్య కొంత మంది చిన్న చిన్న విషయాలకు సహనం కోల్పోయి ఎదుటి వారిపై దాడులు చేస్తున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో ఓ వ్యక్తి పెట్రోల్‌తో దాడికి కొంతమంది అధికారులపై దాడికి దిగాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని తుంగూరులో జరిగింది. తన ఇంటి వద్ద ఉన్న దారికి సంబంధించిన గొడవలో ఆ వ్యక్తి గ్రామానికి వచ్చిన అధికారులపై పెట్రోల్ పిచికారీ చేశాడు. ఈ దాడిలో ఎంపీవొకి బాగా గాయాలు అయ్యాయి.. ఆయనను జగిత్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
చుక్కా గంగాధర్ అనే వ్యక్తి ఇంటి వద్ద ఒక రోడ్డు ఉంది.. దాన్ని ఆయన తన స్థలంలో కలుపుకొని అటువైపు ఎవరూ రావడానికి వీలు లేదని తేల్చి చెప్పాడు. దాంతో గ్రామంలో ఉన్నవారు ఆ రోడ్డు వైపు నుంచి వస్తేనే రాకపోకలకు సౌలభ్యం ఉంటుంది. దీనిపై కొంత కాలంగా గంగాధర్ కి గ్రామస్తులకు గొడవ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొంతమంది కలెక్టర్ కి ప్రజావాణిలో పలుమార్లు ఫిర్యాదులు చేశారు. దానిపై డీపీవో, ఇతర అధికారులు వెళ్లి చెప్పారు. కానీ అతడు ఖాళీ చేయలేదు.. పైగా రోడ్డుకి అడ్డంగా కర్రలు పెట్టాడు గంగాధర్.
ఈ విషయంపై తనతో అధికారులు వచ్చి మాట్లాడుతారని తెలుసుకున్న గంగాధర్ పవర్ స్ప్రేలో పెట్రోల్ పోసి వారిపై అటాక్ చేసేందుకు సిద్దమయ్యాడు. వారు రాగానే ఒక్కసారే ఎస్సైపై దాడి చేశాడు.. ఆ దాడిని అడ్డుకునేందుకు ఎంపీవో ప్రయత్నించారు. ఈ ఘటనలో ఎంపీవోకి గాయాలు కావడంతో ఆయనను రక్షించేందుకు వెంటనే జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా మండలం ఉలిక్కిపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.