దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న.. అవగాహన కల్పించిన ఏ మాత్రం తగ్గడం లేదు. డ్రైవర్లు నిద్రమత్తు, మద్యం సేవించి అతి వేగంగా వాహనాలు నడపడం లాంటివి చేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి అధికారులు అంటున్నారు. ఈ మద్య కొంత మంది సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మొబైల్ మాట్లాడుతూ వాహనం నడపడంపై పోలీసులు సందేశాత్మకంగా ట్విట్టర్ వేదికగా అవగాహన కల్పిస్తున్నారు.
” మీ జీవితం విలువ ఒక ఫోన్ కాలో, ఒక మేసేజో కాదు.. బండి నడిపేటప్పుడు సెల్ ఫోన్ వాడకండి.” అంటూ ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఇక ఫోటోలో చూస్తే ‘ ఓ వాహనదారుడు బైక్ ని పక్కన ఆపి మొబైల్ వినియోగిస్తున్నారు. బైక్ పై ఓ వ్యక్తి ఫోన్ లో మాట్లాడుతూ నడుపుతున్నారు. ‘గమ్యం చేరుకోవాలంటే ఇలా.. గమ్యం ముగించుకోవాలంటే ఇలా’ అంటూ హెచ్చరిస్తూ మీమ్ తయారు చేసి పోస్ట్ చేశారు. ఈ ట్విట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మీ జీవితం విలువ ఒక ఫోన్ కాలో, ఒక మేసేజో కాదు…..
బండి నడిపేటప్పుడు సెల్ ఫోన్ వాడకండి.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/1gztQ3kuo8
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) April 5, 2022
ఇది చదవండి: సీఎస్ సోమేశ్ కుమార్ ఇంట తీవ్ర విషాదం