మనం సినిమా థియేటర్ కో.. మల్టీప్లెక్స్‌కో వెళితే ముందుగా వాహనం పార్కింగ్ చేసుకోవాలి. తర్వాత టిక్కెట్ తీసుకుని క్లోజ్డ్ హాల్‌లో అక్కడున్న సీట్లోనే కూర్చుని సినిమా చూడాలి. ఇది మాములే.. కానీ ట్రెండ్ మారుతోంది అందుకు తగ్గట్టుగా డ్రైవ్ ఇన్ థియేటర్ కాన్సెప్ట్ ని హైదరాబాద్ లో ఏర్పాటుచేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవి ఓకే అయితే.. ఎంచక్కా కారులో కూర్చుని.. ఎదురుగా కనిపించే అతి భారీ స్క్రీన్‌పై సినిమా చూడొచ్చు. ఈ ఓపెన్ థియేటర్‌కి తగ్గట్టుగా సౌండ్ సిస్టమ్ కూడా ఉంటుంది. విదేశాల్లో డ్రైవ్ ఇన్ థియేటర్ కాన్సెప్టు ఎప్పటి నుంచో ఉంది. కార్లలో థియేటర్‌కి వచ్చే వినియోగదారుడు అందులో ఉంటూనే తన కంఫర్ట్‌కి అనుగుణంగా సినిమాను అక్కడ చూస్తుంటారు. మనదగ్గర ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఇప్పటికే డ్రెవ్ ఇన్ థియేటర్లు అందుబాటులో ఉన్నాయి. భాగ్యనగర వాసులకు కూడా డ్రైవ్ ఇన్ థియేటర్ అనుభూతిని అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ఎండీఏ కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి.
ఈ ఆలోచన ఆచరణ రూపం దాల్చితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని పెంచే మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇక్కడ ఉండనుంది.కనీసం 150 కార్ల సామార్థ్యంతో డ్రైవ్ ఇన్ థియేటర్ ఏర్పాటు చేయాలంటే రూ. 5 నుంచి 8 కోట్ల వరకు ఖర్చు వస్తుందని అంచనా వేస్తున్నారు. దీనికి సువిశాలమైన స్థలం కావాలి. నగరం మధ్యలో లోకేషన్ కోసం అన్వేషిస్తున్నారు. మరోవైపు నగరం నలువైపులా విస్తరిస్తూ ఓఆర్‌ఆర్‌ని తనలో కలిపేసుకుంటోంది. దీంతో నగర పరిధిలో ఉన్న ఓఆర్‌ఆర్ ఇంటర్ చేంజ్ పాయింట్ల సమీపంలో ఓపెన్ ఎయిర్ థియేటర్‌ను అందుబాటులోకి తెస్తే ఎలా ఉంటుందనే అంశంపై హెచ్‌ఎండీఏ పరిశీలిస్తోంది.హెచ్‌ఎండీఏ డ్రైవ్ ఇన్ థియేటర్‌కి సంబంధించిన స్థలాలను గుర్తించిన తర్వాత నిర్మాణ కంపెనీల నుంచి దరఖాస్తులు అహ్వానించనున్నట్లు తెలుస్తోంది. డ్రైవ్ ఇన్ థియేటర్ ఏర్పాటుకు ఎవరైనా ముందుకు వస్తే వెంటనే అనుమతులు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కోవిడ్ ఎఫెక్ట్‌తో థియేటర్‌కి వెళ్లి సినిమా చూసేందుకు వెనుకాడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అందువల్ల డ్రైవ్ ఇన్ థియేటర్ అందుబాటులోకి వస్తే ఎవరి కారులో వారు ఉంటూనే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే బిగ్‌స్క్రీన్‌పై థియేటర్ ఎక్స్‌పీరియన్స్ పొందే అవకాశం ఉంటుంది. మరోవైపు డ్రైవ్ ఇన్ థియేటర్ సౌకర్యం ఉన్న అతి కొద్ది నగరాల జాబితాలో హైదరాబాద్‌కి చోటు దక్కుతుంది.
Screening of #Sooryavanshi
People watch Sooryavanshi at a screening at India’s first open air rooftop drive-in cinema in Mumbai.
Remember the good days at Bandra during 80’s open theatre pic.twitter.com/sHRDi3t4Aq
— Rohan Savanoor (@chiyaan009) November 7, 2021