ఇంట్లో కుక్కలను పెంచుకుంటే అవి కుటుంబ సభ్యుల్లా కలిసిపోతాయి.. కానీ విధి కుక్కల పరిస్థితి అలా కాదు.. పిచ్చెక్కితే ఎవరిని పడితే వారికి కరిచేస్తుంది.. ప్రాణాలు పోయేవరకు దాడి చేస్తాయి. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కుక్కల దాడుల్లో ఎంతో మంది చిన్నారులు తీవ్ర గాయాలపాలయ్యారు.. అంబర్‌పేట్‌లో బాలుడిని చంపేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ అంబర్‌పేట్‌లో వీధి కుక్కల భారిన పడి నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ కన్నుమూసిన విషయం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. బాలుడు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో కొన్ని వీధి కుక్కలు బాలుడిపై అతి కృరంగా దాడి చేసి చంపాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ప్రజల్లో భయందోళనలు మొదలయ్యాయి. వీధి కుక్కల నిర్మూలన విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
గత కొంత కాలంగా హైదరాబాద్ ప్రజలకు వీధి కుక్కల భయం వెంటాడుతుంది.. గతంలో కుక్కలు దాడులు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.. కానీ ఈ మద్య అంబర్‌పేట్‌లో బాలుడిపై వీధి కుక్కలు అత్యంత కృరంగా దాడి చేసి చంపేసిన ఘటన నగరవాసులను ఉలిక్క పడేలా చేసింది. ఈ విషయంపై ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ లోకి దిగింది.. ప్రజలకు కుక్కడ బెడత లేకుండా చేస్తామని హామీ ఇచ్చింది. కుక్కలు ఎక్కువగా సంచరించే ప్రదేశాలు.. కుక్కల వల్ల ఇబ్బంది కలిగితే వెంటనే 040 2111 1111 అనే కంట్రోల్ రూమ్ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయండి చేయాల్సిందిగా కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో వీధి కుక్కల బెడదపై జీహెచ్ఎంసీ కి ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతుంది. గత 36 గంటల్లో కంట్రోల్ రూం టోల్ ఫ్రీ నెంబర్ కి 15 వేల ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. గతంలో రోజుకు మహా అంటే 30 నుంచి 50 వరకు వచ్చేవని కానీ అంబర్‌పేట్‌లోఘటన తర్వాత ఫిర్యాదుల బాగా పెరిగిపోయాయని అంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కుక్కల సంఖ్య పెరగకుండా నియంత్రణ చేపట్టాలని మున్సిపాలిటీ, గ్రామ పరిధిలో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. కుక్కలకు వందశాతం స్టెరిలైజేషన్ చేయాలని సూచించింది.
ఇదిలా ఉంటే.. అంబర్ పేట్ చిన్నారి ఘటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ 17 ఏళ్ల పాపపై కుక్క దాడి చేసింది. సూర్యాపేటలోని పదేళ్ల బాలుడిపై అటాక్ చేసింది. సిరిసిల్లా జిల్లా కోనరావు పేటకు చెందిన దంపతుల పై దాడి చేశాయి.. ఇలా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ కుక్కల దాడులు జరుగుతున్నాయని.. ప్రాణాలు పోతున్నాయని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం త్వరగా స్పందించి వీధి కుక్కల భారి నుంచి కాపాడాల్సిందిగా కోరుతున్నారు.