సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎంతో తమ టాలెంట్ తో క్రేజ్ పెంచుకున్నారు. చిన్న వయసులో తన దైన డైలాగ్స్ తో ఎంతో మంది మనసు దోచుకున్నాడు ‘గద్వాల్ బిడ్డ’అలియాస్ ఎస్. మల్లికార్జున్ రెడ్డి. గద్వాల్ బిడ్డ, సోషల్ మీడియా మోస్ట్ లవబుల్ కిడ్ మల్లికార్జున్ అకాల మరణం అందరిని దిగ్బ్రాంతికి గురి చేసింది. మహేశ్వర్ రెడ్డి, మాధవి దంపతులకు పుట్టిన బిడ్డ ‘గద్వాల్ బిడ్డ’ అలియాస్ ఎస్. మల్లికార్జున్ రెడ్డి. చనిపోయే ముందు గద్వాల్ బిడ్డ ఎంత ఫేమస్ అయ్యారో అందరికీ తెలిసిందే. ‘గద్వాల్ బిడ్డ’ చనిపోయిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు ఎంత మానసిక క్షోభ అనుభవించారో అందరికీ తెలిసిందే. తాజాగా ‘గద్వాల్ బిడ్డ’ అలియాస్ ఎస్. మల్లికార్జున్ రెడ్డి కుటుంబ సభ్యులు సుమన్ టీవి ఎక్స్ క్లూజీవ్ ఇంటర్వ్యూ లో తమ బిడ్డ ఎలా చనిపోయాడు.. చనిపోయే ముందు తమతో ఏమన్నాడు అన్న విషయాల ఎంతో ఆవేదనతో తెలిపారు.
తమ బిడ్డ అందరితో ఎంతో కలుపుగోలుగా ఉండేవాడని.. తన పుట్టిన రోజుకి ముందు రోజు కన్నుమూశాడని కన్నీరు పెట్టుకున్నారు. చిన్నతనంలో అనారోగ్యానికి గురయ్యాడని.. ఐదు సంవత్సరాల వరకు ఓ డాక్టర్ పర్యవేక్షణలో ఉన్నాడని.. ఆ తర్వాత ఫిజియో థెరపీ ఇతర ట్రీట్ మెంట్స్ అన్నీ ఇప్పించామని తండ్రి మహేశ్వర్ రెడ్డి అన్నారు. తమ బిడ్డ ఆరోగ్యం కోసం తిరుపతి, ముంబాయి కి కూడా వెళ్లి వచ్చామని అన్నారు. తన కుమారుడికి అన్ని పనులు దగ్గరుండి మరీ చూసుకోవాల్సి వచ్చేదని తల్లి మాధవి అన్నారు.
తమ బిడ్డ పుట్టిన రోజు కి ముందురోజే చనిపోవడంతో అందరం తట్టుకోలేకపోయామని.. అందుకే తాను చనిపోయిన రోజు కేక్ కట్ చేయించామని అన్నారు. కర్నూల్ ఆసుపత్రికి తీసుక వెళ్లేందుకు సిద్దమవుతున్న సమయంలో చివరిగా ‘అమ్మా.. నాన్న దేవుడు వచ్చాడు.. నన్ను పిలుస్తున్నాడు.. రమ్మంటున్నాడు.. నేను వెళ్తాను’ బాయ్ బాయ్ అన్నపుడు మా గుండె తరుక్కు పోయిందని మల్లికార్జున్ బాబాయి కన్నీటి పర్యంతం అయ్యారు. హృదయాలను కదిలించే గద్వాల్ బిడ్డ గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.