Hyderabad: నగరంలో గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. మరో వైపు నగరంలోని ఎగువ ప్రాంతాల్లో కురిసిన వాన కారణంగా మూసీ నదిలోకి భారీగా నీరు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలోనే ముసారాంబాగ్ బ్రిడ్జి వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ముసారంబాగ్ బ్రిడ్జిని ఆనుకుని నది ప్రవహిస్తోంది. నిన్న రాత్రి వర్షం కురిసిన నేపథ్యంలో బ్రిడ్జిపైనుంచి కూడా వరద నీరు ప్రవహించింది. ఆ సమయంలో బ్రిడ్జిపైనుంచి రాకపోకల్ని నిలిపివేశారు.
ప్రస్తుతం వరద నీరు కొంత తగ్గటంతో ప్రజా రవాణాను యథాతథం చేశారు. అయితే, మళ్లీ భారీగా వర్షం కురిస్తే ఎగువ ప్రాంతాల్లోని నీరు మూసీ నదిలోకి వచ్చి చేరే అవకాశం ఉంది. దీంతో వరద ఉధృతి పెరగొచ్చు. మరోసారి బ్రిడ్జిపై రాకపోకల్ని నిలిపివేసే అవకాశం ఉంది. కాగా, గురువారం కూడా హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ట్రాఫిక్‌కు కూడా అంతరాయం కలిగింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.