ఉస్మానియా ఆస్పత్రి భవన పరిస్థితులు మరి దారుణంగా ఉన్నాయనేది సోమవారం జరిగిన ఘటనే దీనికి సాక్షంగా నిలుస్తోంది. పేదరికం, మధ్య తరగతి ప్రజలు వేద్యం కోసం ఎక్కువగా ఉస్మానియా ఆస్పత్రికి వస్తూ ఉంటారు. అయితే ఈ ఆస్పత్రిని నిర్మించి ఏన్నో ఏళ్లు అవుతుండటంతో అక్కడక్కడ భవనం పెక్కులు ఉడుపడుతు ఉన్నాయి.
దీంతో పాటు అందులో ఉన్న ఫ్యాన్ లు కూడా చాలా రోజుల నుంచి ఉండటంతో అవి ఏ సమయానికి ఊడిపడుతాయో అని డాక్టర్స్, రోగులు భయంతో వణికిపోతున్నారు. అయితే తాజాగా ఆస్పత్రిలోని ఓ బిల్డింగ్ లో సీలింగ్ నుంచి ఫ్యాన్ ఊడిపడింది. ఈ ఘటనలో ఓ డాక్టర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో భయంతో ఉన్న డాక్టర్స్ ఏకంగా హెల్మెట్లు ధరించి మరీ వైద్యం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలంటూ తెలియజేస్తున్నారు.