సీపీ సజ్జనార్…రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా ముద్రపడిన సజ్జనార్ పోలీసు విభాగంలో తనదైన మార్క్‌ను లిఖించుకున్నాడు. అయితే నేటి వరకు సైబరాబాద్ సీపీగా పని చేశారు సజ్జనార్. మూడేళ్ల కాలం వరకు సైబరాబాద్ సీపీగా ఆయన విధులు నిర్వహించిన ఆయనను బదిలీ చేశారు. ఇక ఇక్కడి నుంచి ఆయనను బదిలీ చేసి TSRTC ఎండీగా నియమించనున్నారు.
ఎన్నో కేసులను లీడ్ చేసిన ఆయన పోలీస్ శాఖలో ఓ మాస్ ఆఫీసర్‌గా పేరు ప్రఖ్యాతలను మూటగట్టుకున్నారు. దీంతో ఈయన పేరు తెలంగాణ పోలీసు విభాగంలో చిరస్థాయిగా నిలిపోయేలా ఏర్పరుచుకున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయనకు అభిమానులున్నారంటే ఆయన పవర్ ఎలాంటిదో అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఆయనను సైబరాబాద్ సీపీ నుంచి బదిలీ చేయటం వెనుక ఎన్నో అనుమానాలకు తావిస్తోంది.