హైదరాబాద్ నగరం ప్రపంచ నగరాలతో పోటీ పడుతూ దిన దినాభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు నగరానికి వరుసకడుతున్నాయి. దీంతో ఉపాధికోసం వివిద ప్రాంతాల నుంచి వచ్చే వారితో నగరం కిక్కిరిసి పోతున్నది. విపరీతమైన ట్రాఫిక్ రద్దీతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. దీని కోసం నగరంలో మెట్రో ప్రాజెక్టును తీసుకొచ్చింది ప్రభుత్వం. హైదరాబాద్ మెట్రోకు ప్రయాణికుల నుంచి విశేషమైన ఆదరణ వచ్చింది.

నగరంలో మెట్రో రెండోదశ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో నిర్మాణం చేపట్టాలని ఖరారు చేస్తూ మైండ్ స్పేస్ వద్ద భూమిపూజ కూడా చేశారు. దీనిపై కసరత్తు చేసిన హెచ్ ఎ ఎమ్ ఎల్ అధికారులు ఆ మార్గంలో మెట్రో స్టేషన్లను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే టెండరు ప్రక్రియ మొదలయ్యింది. రాయదుర్గం వద్ద మొదటి స్టేషన్ ప్రారంభంతో బయోడైవర్సిటీ కూడలి, నానక్ రాంగూడ కూడలి, నార్సింగి, అప్పాకూడలి, రాజేంద్రనగర్, శంషాబద్ టౌన్, ఎయిర్ పోర్టులో నేషనల్ హైవేకి దగ్గర్లో మరో స్టేషన్, ఎయిర్ పోర్ట్ టెర్మినల్ లో భూగర్భమెట్రో స్టేషన్ తో మొత్తంగా తొమ్మిది స్టేషన్లను నిర్మించనున్నారు.
ఇవే కాకుండా భవిష్యత్తులో మరో నాలుగు స్టేషన్లు ఏర్పాటు చేసుకునేలా మెట్రో అలైన్‌మెంట్‌ను అధికారులు డిజైన్ చేశారు. వాటిల్లో నార్సింగి, అప్పాకూడలి మధ్య మంచిరేవుల వద్ద ఒక స్టేషన్ వచ్చే అవకాశం ఉంది. అప్పా కూడలి, రాజేంద్రనగర్ మధ్యలో కిస్మత్‌పూర్‌లోనూ మరో స్టేషన్‌కు అవకాశం ఉంటుంది. రాజేంద్రనగర్ నుంచి శంషాబాద్ పట్టణం మధ్యలో చాలా దూరం ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతం ఎలాంటి జనావాసాలు లేవు. నిర్మానుష్యంగా ఉంది. ఈ ప్రాంతంలో జనావాసాలు విస్తరిస్తే ఇక్కడ కూడా ఒక స్టేషన్ వచ్చే అవకాశాలున్నాయి. మెుత్తం 36 నెలల్లో 31 కిలోమీటర్లతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. నిర్ణీత గడువులోపు మెట్రో రైల్ ప్రాజెక్ట్ పనులు పూర్తయితే.. నగరం నుంచి శంషాబాద్ విమానాశ్రాయనికి కేవలం 26 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉంటుంది.