విజయానికి కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు రాజమౌళి డైరెక్షన్‌లో.. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి ఇద్దరు సూపర్ స్టార్లతో..భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం RRR. ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తెలుగు, హిందీ, ఇండియా, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను కొల్లగొడుతోంది. ఇప్పటికే బాహుబలి రికార్డులను తిరగరాసింది.
ఇది కూడా చదవండి: అర్థరాత్రి అడవిలో జవాన్లుకు ఎమ్మెల్యే సీతక్క సాయం.. వీడియో వైరల్
ఈ సందర్భంగా సినిమాపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం RRR సినిమా చూసిన సీతక్క.. మూవీపై రివ్యూ ఇచ్చారు. దేశాన్ని విభజించేందుకు ది కశ్మీర్ ఫైల్స్ సినిమా చూడాలి.. అదే దేశం బాగు, సమైక్యత కోసం RRR సినిమా చూడాలి అని పిలుపునిచ్చారు. దీంతో పాటు సినిమా చూడ్డానికి థియేటర్‌కు వెళ్లిన విజువల్స్ వీడియోని షేర్ చేశారు సీతక్క. ప్రస్తుతం ఇది తెగ వైరలువుతోంది. సీతక్క వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
If you want to divide india watch “ kashimir files ” if you want to unite india watch “RRR”
🔥 #RRR should be tax free in all states
🔥My congratulations to @ssrajamouli Garu, unbelievable acting by our brothers @AlwaysRamCharan & @tarak9999 🙏#RRRBlockbuster #ntr #RamCharan pic.twitter.com/SldYyDmqNa— Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) March 28, 2022
ఇది కూడా చదవండి: రామ్ చరణ్ బర్త్‌డే.. వైరలవుతున్న వరుణ్‌తేజ్ కామెంట్స్!