రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఉద్యోగుల జీతాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర మరవలేనిదని.. వారి కృషి వల్లే ఇంత అభివృద్ధి జరిగిందని.. అందుకే వారి జీతాలు పెంచుతూ పోతామని తెలిపారు. జనగామ జిల్లా పర్యటనలో భాగంగా నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు కేసీఆర్. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడతూ.. ఉద్యోగుల వేతనాల పెంపుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి : టీఆర్‌ఎస్ vs బీజేపీ.. నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు లేవు. ఉద్యోగుల కృషి వల్లనే తెలంగాణ రాష్ట్రం ఇంత అభివృద్ధి జరిగింది.
తెలంగాణ వస్తే ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయని చెప్పాను. చెప్పిన విధంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా జీతాలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఏం చేసుకుంటాం.. దానిలో ఎంతో కొంత రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచుతూ పోతాం. ఉద్యోగులు కూడా ఆర్థికంగా బలపడితే.. టెన్షన్ ఫ్రీ ఉంటే పిల్లల్ని బాగా చదివిపిస్తారు’’ అని తెలిపారు. కేసీఆర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.