ప్రమాదం చోటు చేసుకుంది.పెళ్ళికి వెళ్లి వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 40 మందికి గాయాలు అయ్యాయి.
ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ట్రక్ డ్రైవర్లు సజీవ దహనమయ్యారు. రాజస్థాన్ జాతీయ రహదారిపై రెండు ట్రక్కులు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో చిక్కుకున్న డ్రైవర్లు సజీవ దహనమయ్యారు. రోడ్డు ప్రమాదాల మీద పోలీసులు అవగాహన కల్పించినా గానీ ఏదో ఒక చోట ఏదో ఒక సమయంలో ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో ఇవాళ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
సోమవారం ఉదయం పెళ్లి వేడుకకు వెళ్లి వస్తుండగా ఆటోను తప్పించబోయి బస్సు బోల్తా పడింది. పెళ్లి వేడుక కోసం బంధువులతో హైదరాబాద్ బయలుదేరిన బస్సు రామగుండం వస్తుంది. ఈ క్రమంలో కాట్నపల్లి వద్ద ఆటోను తప్పించబోయి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణిస్తున్నారు. మొత్తం 40 మందికి గాయాలు అవ్వగా.. 25 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సుల్తానాబాద్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న నలుగురిని మాత్రం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.