ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల పేలుడు ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సాధారణంగా కెమికల్ ఫ్యాక్టీరీల్లో ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతున్నాయి. కన్స్ట్రక్షన్ కంపెనీలు సైతం రాళ్లు తొలగించే క్రమంలో పేలుడు పదార్ధాలను అమర్చడంతో భారీ పేలుళ్లు సంభవిస్తుంటాయి.. కొన్ని సమయాల్లో వీటి వల్ల ప్రాణాలకు ప్రమాదమే కాదు.. ఆస్తి నష్టం కూడా వాటిల్లుతుంది.
ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో వరుస పేలుడు ఘటనలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిన్న అనంతపురం పట్టణంలో ఆర్టీవో కార్యాలయం వద్ద పేలుడు ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఓ అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్ గా చేస్తున్న సతీష్ అనే వ్యక్తి ఓ పాత కలర్ బాక్స్ ఓపేన్ చేయగా అది పేలిపోవడంతో వాచ్‌మెన్ శరీరం ముక్కలు ముక్కలై 30 అడుగుల దూరంలో ఎగిరిపడింది. తాజాగా ల్బీనగర్ లో భారీ పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు పగుళ్లు రావడంతో ప్రజలు లబో దిబో అంటున్నారు. వివరాల్లోకి వెళితే..
రంగారెడ్డి జిల్లాలో అకస్మాత్తుగా పెలుళ్ల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఎల్బీనగర్ పరిసర ప్రాంతంలో పేలుళ్ల కారణంగా పెద్ద ఎత్తున శబ్ధాలు వినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గత కొంత కాలంగా ఓ నిర్మాణ సంస్థ కన్స్ట్రక్షన్ వర్క్ మొదలు పెట్టింది. ఎల్బీనగర్ కృష్ణా నగర్ కాలనీలో బండరాళ్లను పగులగొట్టేందుకు భారీ పేలుడు పదార్ధాన్ని వినియోగించారు. ఆ పేలుడు ధాటికి కొన్ని బండరాళ్లు ఇళ్లపై పడ్డాయి. అంతేకాదు పేలుడు ధాటికి అక్కడ ఇళ్లు కంపించిపోయాయి. గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో అక్కడ నివాసం ఉంటున్న స్థానికులు ఒక్కసారే భూకంపం వచ్చిందా అన్ని భయపడి పరుగులు పెట్టారు.
ఈ సందర్భంగా స్థానికులు ఇక్కడ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇబ్బందులు మొదలయ్యాయని.. తరుచూ బాంబ్ బ్లాస్టింగ్ శబ్ధాలు వస్తూనే ఉన్నాయని.. గతంలో బాగా దుమ్మూదూళి ఇండ్లలోకి వస్తే ఫిర్యాదు చేశాం.. దాంతో చుట్టూ రేకులు ఏర్పాటు చేశారు. ఇండ్లకు ఆనుకొని ఆ కంపెనీ వాళ్లు పూడికలు తీస్తున్నారు. లోపల వర్క్ చేస్తున్న వాళ్లకు కూడా తీవ్ర గాయాలు అవుతున్నాయని.. వారిని ఎవరూ చూడకుండా బయటకు తరలించి చికిత్స అందించారని అన్నారు. గతంలో పేలుళ్లు సంభవించినా ఎలాంటి ప్రమాదం జరగలేదని.. ఈసారి పేలిన బాంబు తీవ్రత ఎక్కువ ఉండటంతో ఇళ్లకు పగుళ్లు వచ్చాయని.. కటికీ అద్దాలు పగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కన్స్ట్రక్షన్ ఎవరికీ ఇబ్బంది లేకుండా పనులు చేసుకోవాలని.. లేదంటే పోలీసులకు.. జీహెచ్ఎంసీ అధికారులకు కంప్లైంట్ చేస్తామని కాలనీ వాసులు అంటున్నారు.