ఈ మద్య దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు పదుల సంఖ్యల్లో జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదంలో ఎంతో మంది అమాయకులు చనిపోతున్నారు.. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం.. రూల్స్ పాటించకుండా వేగంగా వెళ్లడం ఇలా ఎన్నో కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక హైదరాబాద్‌లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలతో పోలీసు యంత్రాంగం అలర్ట్ అయ్యింది. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం డ్రంక్ అండ్ డ్రైవ్ కావడంతో పోలీసులు యాక్షన్ మొదలు పెట్టారు.
హైదరాబాద్ అంబర్ పేట్ అలీ కేఫ్ చౌరస్తా లో వాహన తనిఖీలు చేస్తున్న కాచిగూడ ట్రాఫిక్ పోలీసులకు వింత అనుభవం ఎదురైంది. తనిఖీలు నిర్వహిస్తుండగా AP23M9895 వాహనాన్ని పట్టుకుని చెక్ చేశారు. ఆ బైక్‌పై ఉన్న చలానాలు చూసి పోలీసులు బిత్తర పోయారు. దానిపై 179 చనాలాకు 42,475/- రూపాయలు ఉండడంతో పోలీసుల మైండ్ బ్లాక్ అయ్యింది.
ఈ క్రమంలోనే అతనిని పట్టుకొని ప్రశ్నించాలనే లోపు బండి వదిలి పరారయ్యాడు వాహనదారుడు. భారీ చలాన్ ఉండడంతో బైక్‌ను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు. ఇటీవల కాలంలో మందు బాబులు మందు తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న ఒక రోజే మద్యం తాగి వాహనాలు నడుపుతూ రెండు చోట్ల నలుగురు మృతి చెందారు.