ఇటీవల హైదరాబాద్ లో కొంతమంది క్లబ్ యజమానులు అర్థరాత్రి సమయం దాటిన తర్వాత కూడా కొనసాగిస్తున్నారని ఎన్నో ఆరోపనలు వస్తున్నాయి. పోలీసులు రైడ్ చేసి కేసులు పెడుతున్నా వీరిలో మార్పు రావడం లేదు. బంజారాహిల్స్‌లోని ర్యాడిసన్ బ్లూ హోటల్‌పై పోలీసులు ఫుడింగ్ మింగ్ పబ్ సమయం దాటిన తర్వాత కూడా పబ్ ని కొనసాగిస్తున్నారన్న విషయం తెలుసుకొని రైడ్ చేసి దాదాపు 150 మందిని అదుపులోకి తీసుకున్నాన్నారు.
ఈ దాడిలో పలువురు కీలకమైన వ్యక్తులు కూడా ఉన్నట్లు సమాచారం. అందులో బిగ్ బాస్ విజేత సింగర్ విజేత రాహుల్ సిప్లిగంజ్‌తోపాటు పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పబ్ సమయం గురించి తమకు తెలియదని.. తమను ఎందుకు పోలీస్ స్టేషన్ కి తీసుకు వచ్చారో అర్థం కావడం లేదని కొంతమంది యువతీ, యువకులు ఆందోళనకు దిగారు.