ఏ విధమైన ఆసర లేనివారు, వృద్ధులు ఇతర వ్యక్తులు పొట్టపోసుకోవడం కోసం యాచిస్తుంటారు. నగర కూడళ్లలో, బస్ స్టాండ్ లలో, రైల్వేస్టేషన్ లలో, టెంపుల్స్ దగ్గర భిక్షాటన చేస్తూ కాలం వెల్లదీస్తుంటారు.
ఏ విధమైన ఆసర లేనివారు, వృద్ధులు ఇతర వ్యక్తులు పొట్టపోసుకోవడం కోసం యాచిస్తుంటారు. నగర కూడళ్లలో, బస్ స్టాండ్ లలో, రైల్వేస్టేషన్ లలో, టెంపుల్స్ దగ్గర భిక్షాటన చేస్తూ కాలం వెల్లదీస్తుంటారు. కొందరు తమకు తోచినంత యాచకులకు అందిస్తుంటారు. అయితే ఈ మధ్య యాచకులు ఎక్కువగా కనిపిస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పదుల సంఖ్యలో దర్శనమిస్తున్నారు. దీనికి గల కారణం ఓ బెగ్గింగ్ మాఫియా. సులువుగా డబ్బులు సంపాదించేందుకు కొందరు వ్యక్తులు వృద్ధులతో, చిన్న పిల్లలతో భిక్షాటన చేయిస్తున్నారు. తాజాగా నగరంలో బెగ్గింగ్ మాఫియా పోలీసులకు పట్టుబడింది. ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ లో బెగ్గింగ్ మాఫియా గుట్టురట్టయ్యింది. ఈజీ మనీ కోసం అలవాటుపడిన అనిల్ పవార్ అనే వ్యక్తి వృద్ధులకు డబ్బు ఆశచూపి యాచక వృత్తిలోకి దింపి సొమ్ము చేసుకుంటున్నాడు. నగరంలోని కొంతమంది వృద్ధులను తీసుకు వచ్చి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ దగ్గర భిక్షాటన చేయిస్తు వారికి రోజుకి రెండు వందల రూపాయలు ఇస్తూ మిగిలిన సొమ్ము అంతా అనిల్ పవార్ తీసుకుంటున్నాడు. ఈ బెగ్గింగ్ మాఫియా ద్వారా అనిల్ పవార్ లక్షలు పోగేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు బెగ్గింగ్ మాఫియాను గుర్తించి నిర్వాహకుడు అనిల్ పవార్ ను అరెస్ట్ చేసి, దాదాపు 25మంది యాచకులను అదుపులోకి తీసుకున్నారు. ఎప్పటి నుంచి వీరి వ్యవహారం నడుస్తోంది? దీని వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారు? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.