తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మావోల ప్రభావం చాలా వరకు తగ్గిపోయిందని పోలీసులు చెబుతున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేయడమే కాదు.. వారి కుటుంబ సభ్యులను కలిసి తమ బిడ్డలను ఉద్యమ బాట విడిచి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ మావోయిస్టు అనే పదం వినిపించకుండా చేసేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందుకోసం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేయడమే కాదు.. వారి కుటుంబ సభ్యులను కలిసి తమ బిడ్డలను ఉద్యమ బాట విడిచి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మావోల ప్రభావం చాలా వరకు తగ్గిపోయిందని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ములుగు జిల్లాలో బీర్ బాటిల్ బాంబు కలకలం రేపింది. ములుగు జిల్లా పామునూరు గ్రామ పరిసరాల్లో ఈ బీరు బాటిల్ బాంబ్ ని గుర్తించారు పోలీసులు. ఇది పోలీసులను టార్గెట్ గా చేసుకొని మావోయిస్టులు అమర్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
ములుగు జిల్లా వెంకటాపురం మండలం పామనూర్ అటవీ ప్రాంతంలో బీర్ బాటిల్ లో ఐఈడీ లను అమర్చి మందుపాతరను అమర్చి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన స్పెషల్ పార్టీ ఆ బాంబుని నిర్వీర్యం చేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అంటున్నారు. బీరు బాటిల్ పేలుడుకి సంబంధించిన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇటీవల ములుగు అడవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.. వారిని లక్ష్యంగా చేసుకొని ఈ మందు పాతర అమర్చి ఉంటారని భావిస్తున్నారు.
సాధారణంగా కారు, బైక్, టీఫిన్ బాక్సులు, పార్సిల్ బాంబులతో దాడులు చేయడం చూశామని.. ఇలా బీరు బాటిల్ లో ఐఈడీలను అమర్చి ప్లాన్ చేయడం మొదటిసారిగా చూస్తున్నామని పోలీసులు అంటున్నారు. ఇటీవల ములుగు అటవీ ప్రాంతంలో స్పెషల్ పార్టీ, సీఆర్సీఎఫ్ బెటాలియన్ కూంబింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో మావోయిస్టులు కొత్తతరహాలో దాడులకు వ్యూహాలు పన్నుతున్న విషయం గ్రహించామని అంటున్నారు పోలీసులు. ఏది ఏమైనా బీర్ బాటిల్ బాంబ్ ను ముందుగానే పసిగట్టడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు పోలీస్ అధికారులు. ఈ ఘటనకు సంబంధించి పలువురు మావోయిస్టు అగ్రనేతలు వెంకటాపురం స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు గా సమాచారం.