తెలుగు ఇండస్ట్రీలో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన అలీ తర్వాత స్టార్ కమెడియన్ గా ఎంతో ఎత్తుకు ఎదిగారు. కొన్ని చిత్రాల్లో హీరోగా నటించినప్పటికీ ఇండస్ట్రీలో కమెడియన్ గానే కొనసాగుతున్నారు. ఓ వైపు వెండితెరపై నటిస్తూనే బుల్లితెరపై పలు షోల్లో వ్యాఖ్యాతగా తన హవా కొనసాగిస్తున్నారు. ఓ ప్రముఖ ఛానలెల్ లో సినీ సెలబ్రెటీలను ఇంటర్వ్యూలో తీసుకుంటూ బాగా ఫేమస్ అయ్యారు. ఇదిలా ఉంటే ఈ మద్యనే అలీకి మరో గౌరవం దక్కింది. ఏపిలో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా సీఎం జగన్ ఆయనను నియమించారు. నటుడు అలీ తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ ని హైదరాబాద్ రాజ్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.
నటుడిగా వెండితెర, బుల్లితెరపై తన సత్తా కొనసాగిస్తున్న కమెడియన్ అలీ ఇటీవల రాజకీయాల్లోకి ప్రవేశించారు. అలీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్య సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే. ఇటీవల అలీ పెద్ద కూతురు ఫాతిమా వివాహ నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భంగా తన కూతురు వివాహ ఆహ్వాన పత్రికను తెలంగాణ గవర్నర్ తమిళసై కి అందజేసి వివాహానికి రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు అలీ. కొద్దిసేపు ఆమెతో అలీ ముచ్చటించారు.. ఇక పెళ్లి పత్రికను స్వీకరించిన గవర్నర్ తప్పకుండా వివాహ వేడుకకు హాజరవుతానని మాట ఇచ్చినట్లు తెలుస్తుంది.
ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. తెలంగాణ గవర్నర్ తమిళసై ని కలవడం ఎంతో సంతోషంగా ఉందని.. తమిళంలో మాట్లాడటంతో ఆమె చాలా సంతోషించారు.. నా కూతురు ఫాతిమా పెళ్లికి తప్పకుండా వస్తానని మాట ఇవ్వడం మరింత ఆనందంగా ఉంది.. అంతేకాదు నా సినిమాలు చూసి తెలుగు నేర్చుకున్నానని ఆమె అనడం నాకు గర్వంగా ఉంది.. ఆ మాటలు చాలా సంతోషాన్ని కలిగించాయి.. అంత పెద్ద పొజీషన్ లో ఉన్నా కూడా ఎంతో గౌరవంగా రెస్పాన్స్ ఇచ్చినందుకు ఆమెకు కృతజ్ఞతలు’ అన్నారు.
@DrTamilisaiGuv #Ali pic.twitter.com/C5zwxHkjUU
— BA Raju’s Team (@baraju_SuperHit) November 9, 2022