గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన వారం రోజులు వ్యవధిలో పలు గుండెపోటు మరణాలు వెలుగు చూశాయి. పట్టుమని పాతికేళ్లు లేని వారు సైతం గుండెపోటు కారణంగా ప్రాణాలు విడవడం ఆందోళన కలిగిస్తోంది. మరీ ముఖ్యంగా అప్పటివరకు ఎంతో ఆరోగ్యంగా, అందరితో కలిసిమెలిసి మెరిగిన వారు.. ఉన్నట్లుండి కుప్ప కూలి మృత్యువాత పడుతున్నారు. తాజాగా ఓ యువ సాఫ్ట్‌వేర్ థియేటర్‌లో సినిమా చూస్తూనే గుండెపోటుతో కుప్ప కూలాడు.
గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన వారం రోజులు వ్యవధిలో పలు గుండెపోటు మరణాలు వెలుగు చూశాయి. పట్టుమని పాతికేళ్లు లేని వారు సైతం గుండెపోటు కారణంగా ప్రాణాలు విడవడం ఆందోళన కలిగిస్తోంది. మరీ ముఖ్యంగా అప్పటివరకు ఎంతో ఆరోగ్యంగా, అందరితో కలిసిమెలిసి మెరిగిన వారు.. ఉన్నట్లుండి కుప్ప కూలి మృత్యువాత పడుతున్నారు. చిన్నారులు, యువత, వృద్ధులు, సామాన్యులు, సెల్రబిటీలు అనే తేడా లేకుండా గుండె పోటు కారణంగా మృతి చెందుతున్నారు. తాజాగా ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. థియేటర్‌లో సినిమా చూస్తూ.. గుండెపోటుతో కుప్ప కూలాడు. ఆ వివరాలు..
ఖమ్మం జిల్లా, మధిర మండలం బుచ్చిరెడ్డి పాలెంకు చెందిన మురళీ కృష్ణ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం అతడు సినిమా చూడటం కోసం థియేటర్‌కు వెళ్లాడు. అలా మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తుండగా సడెన్‌గా గుండెల్లో ఇబ్బందిగా అనిపించింది. తనకు ఏమవుతుందో అర్థం అయ్యేలోపే.. కూర్చున్నచోటనే కుప్ప కూలాడు మురళీ. ఇది గమనించిన థియేటర్ యాజమాన్యం.. అతన్ని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే అతడు తుది శ్వాస విడిచాడు. చేతికి అందిన తనయుడు హఠాన్మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వరుస గుండెపోటు మరణాలపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.