Nothing Phone: జులై నెలలో పలు ఫోన్ల కంపెనీలు తమ కొత్త ఫోన్లను విడుదలకు సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో నథింగ్ ఫోన్ 1 విడుదల కోసం వినియోగదారులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫోన్ ప్రపంచ వ్యాప్తంగా జులై 12 విడుదలకు సిద్ధమైంది. ఈ ఫోన్ విడుదలకు కొన్ని నెలల ముందు నుంచే ఫోన్ హైప్ క్రియేట్ అయింది. మరి, ఎందుకంత హైప్ క్రియేట్ అయింది అంటే.. దానికో కారణం లేకపోలేదు. ఈ ఫోన్‌ను కాల్‌పీకి చెందిన నథింగ్ కంపెనీ తయారు చేస్తోంది. కాల్‌పీ పాత వన్ ప్లస్ ఫోన్లను తయారు చేసిన కంపెనీకి కో ఫౌండర్‌గా ఉండేవాడు. తర్వాత ఆ కంపెనీనుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు నథింగ్ ఫోన్ 1ను తయారు చేశాడు. నథింగ్ ఫోన్‌కు ఇంత హైప్ రావటానికి కాల్‌పీ ఒక కారణం అయితే.. ఇన్‌వెస్టర్స్ కూడా మరో కారణం.
ప్రపంచ వ్యాప్తంగా ఈ నథింగ్ కంపెనీలో చాలా మంది పెట్టుబడులు పెట్టారు. ఇండియాకు సంబంధించి ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్, క్రికేటర్ యువరాజ్ సింగ్‌లు పెట్టుబడులు పెట్టిన వారిలో ఉన్నారు. సినీ, క్రికేట్ రంగానికి చెందిన ప్రముఖులు పెట్టుబడులు పెట్టడంతో ఈ ఫోన్‌కు విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. ఇక ఈ ఫోన్ విషయానికి వస్తే.. సరికొత్త డిజైన్, ఫీచర్స్‌తో చూడగానే కొనాలనిపించేలా ఉంది. ధర కూడా మధ్య తరగతివారికి అందుబాటులో ఉండేలా ఉంటంతో వినియోగదారులు ఈ ఫోన్‌పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. మరి, త్వరలో మార్కెట్‌లోకి రానున్న నథింగ్ ఫోన్ 1పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : WhatsApp: వాట్సాప్ నుంచి మహిళల కోసం మరో సరికొత్త ఫీచర్!