సోషల్ మెసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్ కు కోట్లలో యూజర్లు ఉన్నారు. వారి కోసం ఎప్పటికప్పుడు ఈ సంస్థ సరికొత్త ఫీచర్స్ తీసుకొస్తూనే ఉంటుంది. కనీసం నెలకు ఒక అప్ డేట్ అయినా ఇస్తుంటుంది. తాజాగా వాట్సాప్ తీసుకురాబోయే ఫీచర్ మాత్రం అందరికీ ఎంతో మేలు చేయనుంది.
ఇప్పుడు ఎక్కడ చూసిన ఆఫర్స్, డిస్కౌంట్స్, డీల్స్ అంటూ తెగ ఫోన్స్ వచ్చేస్తున్నాయి. మా దగ్గర ఇలాంటి ఆఫర్స్ ఉన్నాయి. అలాంటి ఆఫర్స్ ఉన్నాయి అంటూ ఫోన్స్ చేసి తెగ విసిగిస్తుంటారు. కొందరైతే ఆ కాల్స్ ద్వారా ప్రజలను మోసం చేస్తుంటారు కూడా. వీటి గోల నుంచి తప్పించుకోవాలి అంటే మీరు కచ్చితంగా ఏదైనా థర్డ్ పార్టీ యాప్ ని వాడాల్సిందే. అలా అయితే వచ్చేది స్కామ్/స్పామ్ కాల్ అయితే తెలిసే అవకాశం ఉంటుంది. అందరూ ఇలా థర్డ్ పార్టీ యాప్ లతో బ్లాక్ చేస్తున్నారని.. వాళ్లు కూడా పంథా మార్చారు. కొత్తగా వాట్సాప్ ద్వారా కాల్స్ చేయడం ప్రారంభించారు. వాట్సాప్ కి ఈ విషయంలో చాలానే ఫిర్యాదులు వెళ్లాయి. ఇప్పుడు వాటిపై ఆ సంస్థ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.
వాట్సాప్.. ప్రపంచవ్యాప్తంగా ఈ సోషల్ మెసేజింగ్ యాప్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మెసేజెస్ కోసం మాత్రమే కాకుండా, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, గ్రూప్ చాట్, మీటింగ్స్ వంటి వాటికి వాడుతుంటారు. దీనిలో బిజినెస్ అకౌంట్స్ కూడా ఉంటాయి. అయితే దీని వల్ల ఉన్న లాభాలతో పాటుగా.. యూజర్లకు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది స్పామ్ కాల్స్. అదేలే మన భాషలో స్కామ్ కాల్స్ అంటాం. అలా మీకు తెలియని నంబర్ నుంచి కూడా మీకు కాల్స్ వస్తాయి. దానిని అందిపుచ్చుకుని కేటుగాళ్లు కాల్స్ కోసం వాట్సాప్ ని వాడేస్తున్నారు. కొన్ని ఎల్లో పేజెస్ కూడా వాట్సాప్ కాల్స్ చేసి విసిగిస్తున్నాయి.
ఈ స్పామ్ కాల్స్ ద్వారా యూజర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంలో వాట్సాప్ కు ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ విషయంపై వాట్సాప్ చాలా సీరియస్ యాక్షన్స్ కు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఇలాంటి స్కామ్/స్పామ్ కాల్స్ అరికట్టేందుకు సరికొత్త ఫీచర్ ను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఆ ఫీచర్ ద్వారా మీరు వద్దు అనుకుంటే మీకు ఎలాంటి అనౌన్ నంబర్స్ నుంచి కాల్స్ రావు. కాకపోతే మీకు ఫలానా నంబర్ నుంచి కాల్ వచ్చినట్లు తెలుస్తుంది.
అనౌన్ నంబర్ నుంచి మెసేజ్ లు మాత్రం వస్తాయి. ఫలానా నంబర్ నుంచి మెసేజ్ వస్తే.. యూజర్ కు నచ్చితే తిరిగి కాల్ చేయడం, లేదా ఆ మెసేజ్ కి రిప్లై ఇవ్వడం చేయచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలెప్మెంట్ స్టేజ్ లోనే ఉంది. సెలక్టివ్ ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ వాట్సాప్ న్యూ ఫీచర్ ని టెస్ట్ చేసే అవకాశం కల్పించారు. అయితే ఎప్పటి నుంచి ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి వస్తుంది అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. వాట్సాప్ తీసుకురాబోతున్న ఈ ఫీచర్ వల్ల ఉపయోగం ఉంటుంది అంటారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.