ఇప్పుడు అందరూ ఎలక్ట్రిక్, సీఎన్జీ వెహికల్స్ నే ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఆ వాహనాలు అయితే వారికి పెట్రోల్- డీజిల్ ఖర్చులు తగ్గుతాయని. అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్లు మాత్రమే కాదు.. ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా వస్తున్నాయి. కానీ, అవి కాస్త ఖరీదుగా ఉంటాయి. ఇప్పుడు ఒక యూనివర్సిటీ బడ్జెట్ ధరలో ఎలక్ట్రిక్ సైకిల్ ని తయారు చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
సాధారణంగా మార్కెట్ లో ఎలక్ర్టిక్ వాహనాలు అంటే విపరీతమైన డిమాండ్, క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీల్లో ఎక్కడ చూసినా విద్యుత్ వాహనాలు కనిపిస్తున్నాయి. స్కూటీలు కూడా ఇప్పుడు విద్యుత్ వే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే పెట్రోల్ రేట్లు అధికంగా ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. చాలా మంది సిటీల్లో తిరిగేందుకు ఎలక్ట్రిక్ స్కూటీనే ఎంచుకుంటున్నారు. అయితే ఆఫీస్- ఇంటికి తిరిగేందుకు ఎలక్ట్రిక్ స్కూటీ తీసుకోవాలి అంటే కాస్త ఖరీదనే చెప్పాలి. అందుకే అలాంటి వారి కోసం ఒక బడ్జెట్ ఎలక్ర్టిక్ సైకిల్ తీసుకొచ్చాం. అసలు ఆ సైకిల్ ఫీచర్స్ ఏంటి? ధర ఎంత? అనే విషయాలు చూద్దాం.
సాధారణంగా సిటీల్లో ఆఫీస్ – ఇంటికి వెళ్లేందుకే విద్యుత్ స్కూటర్లు కొనుగోలు చేస్తుంటారు. అయితే అవి కాస్త ఖరీదుగా ఉంటాయనే విషయం తెలిసిందే. అలాంటి వారి కోసం ఈ ఎలక్ట్రిక్ సైకిల్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పచ్చు. ఎందుకంటే ఇది బడ్జెట్ ధరలో ఉండటమే కాకుండా దాదాపుగా మీ దగ్గర స్కూటీ ఉన్నట్లే ఉంటుంది. దీనిని రాజస్థాన్ ఉదయ్ పూర్ లో ఉన్న మహారా ప్రతాప్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ వాళ్లు తయారు చేసింది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం వాళ్లు ఈ సరికొత్త ఎలక్ట్రిక్ సైకిల్ ను రూపొందించారు. చూడటానికి సాధారణ సైకిల్ లాగానే కనిపిస్తుంది. ఈ సైకిల్ 45 కిలో మీటర్ల రేంజ్ లో వస్తుందని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్ హెడ్ డాక్టర్ విక్రమాదిత్య వెల్లడించారు.
ఇంక ఈ సైకిల్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇంది ఎలక్ట్రిక్ గేర్లు, పెడల్స్ సిస్టమ్, హార్న్, ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది. ఈ సైకిల్ లో రెండు డిస్క్ బ్రేకులు కూడా ఉంటాయి. ఈ సైకిల్ సునాయాసంగా 160 కిలోల వరకు బరువును మోయగలదు. ఛార్జ్ లేకుంటే మీరు ఈ సైకిల్ ని పెడలింగ్ చేసలుకుంటే వెళ్లిపోవచ్చు. కేవలం 30 నిమిషాల టైమ్ లోనే ఛార్జ్ చేసుకోగలదు. దీని ధర చూస్తే.. కొత్త సైకిల్ తయారు చేసేందుకు 30 నుంచి 35 వేలు అవుతుందని చెబుతున్నారు. అలాగే మీ వద్ద ఉన్న పాత సైకిల్ ని ఎలక్ట్రిక్ సైకిల్ గా మార్చేందుకు 18 వేలు ఖర్చు అవుతుందని తెలిపారు. సైకిల్ కావాలనుకునే వాళ్లు యూనివర్సిటీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగాన్ని సంప్రదించాల్సిందిగా కోరారు. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.