ఇకపై తెలంగాణలో సెల్ ఫోన్ దొంగలకు కాలం చెల్లినట్లే అంటున్నారు పోలీసులు. దానికి కారణం సీఐడీ రంగంలోకి దిగడమే. ఇందుకు సంబంధించి కేంద్ర టెలీకమ్యూనికేషన్స్ శాఖ ఆధ్వర్యంలో 'సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రార్(CIER)'తో త్వరలోనే ఒప్పందం కుదుర్చుకోబోతోంది తెలంగాణ ప్రభుత్వం.
నేటి సమాజంలో దొంగతనాలు చేసేవారు ఎక్కువై పోయారు. మరీ ముఖ్యంగా సెల్ ఫోన్ దొంగిలించే చోరులు సొసైటీలో విచ్చల విడిగా తిరుగుతున్నారు. ఇక తమ ఫోన్ పోగొట్టుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. పోయిన సెల్ దొరుకుతుందన్న గ్యారంటీ కూడా లేదు. అయితే ఇకపై తెలంగాణలో సెల్ ఫోన్ దొంగలకు కాలం చెల్లినట్లే అంటున్నారు పోలీసులు. దానికి కారణం సీఐడీ రంగంలోకి దిగడమే. ఇందుకు సంబంధించి కేంద్ర టెలీకమ్యూనికేషన్స్ శాఖ ఆధ్వర్యంలో ‘సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రార్(CIER)’తో త్వరలోనే ఒప్పందం కుదుర్చుకోబోతోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ ఒప్పందం కుదిరితే పోయిన సెల్ ఫోన్ లు త్వరగా ఎలా దొరుకుతాయి ఇప్పుడు తెలుసుకుందాం.
రాష్ట్రంలో సెల్ ఫోన్ దొంగతనాల కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అదీకాక చోరీకి గురైన ఫోన్ లు దొరుకుతాయి అన్న గ్యారంటీ కూడా లేదు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర సీఐడీ విభాగం.. సెంట్రల్ టెలీకమ్యూనికేషన్స్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రార్ (CEIR) తో త్వరలోనే ఒప్పందం కుదుర్చుకోబోతోంది. ఈ ఒప్పందం కుదిరితే.. సీఈఐఆర్ సాయంతో.. దొంగిలించ బడ్డ సెల్ ఫోన్ ను క్షణాల్లో ట్రాక్ చేయడమే కాక.. అందులో వేరే సిమ్ కార్డు వేయడానికి ప్రయత్నిస్తే.. వెంటనే వివరాలు తెలుస్తాయి. కాగా ఇలాంటి సిస్టం ఇండియాలో కేవలం దిల్లీ, ముంబాయి, బెంగళూరు ప్రాంతాల పోలీసులు మాత్రమే వినియోగిస్తున్నారు. దాంతో సెల్ ఫోన్ దొంగలను సులువుగా పట్టుకుంటున్నారు. ఇక త్వరలోనే ఈ సిస్టం తెలంగాణలో కూడా అమలు కాబోతుంది.