ఈ-రూపీ ఆవిష్కరణ!..
డిజిటల్ ఇండియాలో మరో ముందడుగు…
గూగుల్ పే, ఫోన్ పే అవసరం లేదు…
నగదు రహిత లావాదేవీల కోసం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త పేమెంట్ వ్యవస్థను రూపొందించింది. ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే రూపాయి. ‘ఈ-రూపీ’ నేటి సాయంత్రం నుంచి అందుబాటులోకి రానుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. బ్యాంకు ఖాతాలు, కార్డులు, యాప్‌లతో సంబంధం లేకుండా నగదు రహిత, కాంటాక్ట్‌లెస్ లావాదేవీలకు ఈ విధానం ఉపయోగపడుతుంది. అయితే ఇ – రూపీని ఏ ఉద్దేశంతో తీసుకుంటారో అదే ఉద్దేశానికి మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న డిజిటల్ పేమెంట్ విధానాలకంటే సరళమైన పద్దతిలో క్యాష్‌లెస్, కాంటాక్ట్‌లెస్‌గా ఉండేలా ఈ-రూపీ చెల్లింపులో నగదు చెల్లింపులను క్యూర్ కోడ్ లేదా ఎస్‌ఎమ్మెస్ స్ట్రింగ్ వోచర్‌ల ద్వారా లబ్ధిదారుడి మొబైల్ ఫోన్‌కి పంపిస్తారు. ఈ వోచర్ లేదా క్యూఆర్ కోడ్‌ను లబ్ధిదారుడు తనకు అవసరమైన చోట వినియోగించుకోవచ్చని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ హెల్త్ అథారిటీ సహకారంతో అభివృద్ధి చేసింది. ఈ వోచర్లు ఇ-గిఫ్ట్ కార్డులు వంటివి, ఇవి ప్రీపెయిడ్ స్వభావాన్ని కలిగి ఉంటాయి.
ఈ కార్డుల కోడ్ ని ఎస్ఎమ్ఎస్ ద్వారా లేదా క్యూఆర్ కోడ్ ద్వారా పంచుకోవచ్చు. ఉదాహరణకు, కోవిడ్-19 వ్యాక్సిన్ కొరకు మీరు ఈ-రూపీ వోచర్లను తీసుకున్నట్లయితే వాటిని కేవలం వ్యాక్సిన్ల కొరకు మాత్రమే రీడీమ్ చేయాల్సి ఉంటుంది. ఈ-రూపీ అనేది ఎలాంటి ఫ్లాట్ ఫారం కాదు. ఇది నిర్ధిష్ట సేవల కొరకు ఉద్దేశించబడిన వోచర్. ఈ-ఆర్ యుపీఐ వోచర్లు అనేవి నిర్ధిష్టమైన వాటి కోసం మాత్రమే ఉద్దేశించబడినవి. బ్యాంకు ఖాతా లేదా డిజిటల్ పేమెంట్ యాప్ లేదా స్మార్ట్ ఫోన్ లేకున్నా ఈ వోచర్లను ఉపయోగించుకోవచ్చు.
ఈ వోచర్లు కార్పొరేట్లు తమ ఉద్యోగుల కొరకు ఈ వోచర్లను జారీ చేయవచ్చు. వ్యాక్సిన్ ఈ-వోచర్ కోసం ఒక ఆప్షన్ తీసుకువస్తామని కేంద్రం ఇంతకు ముందు తెలిపింది. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ కోసం ఈ-వోచర్ కొనుగోలు చేయవచ్చు, అలాగే మరొకరికి బహుమతిగా ఇవ్వవచ్చు. వోచర్లను కొనుగోలు చేసి ఇతరులకు జారీ చేస్తున్న వ్యక్తి వోచర్ల వినియోగాన్ని ట్రాక్ చేయవచ్చు. వీటిని రీడీమ్ చేసుకోవడానికి వోచర్ కార్డు లేదా హార్డ్ కాపీ అవసరం లేదు. సందేశంలో వచ్చిన క్యూఆర్ కోడ్ సరిపోతుంది.
నేషనల్ హెల్త్ అథారిటీ ప్రకారం, ఇప్పటికే ఎనిమిది బ్యాంకులు ఈ-ఆర్ యుపీఐతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండస్ సిండ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్నాయి.
Digital technology is transforming lives in a major way and is furthering ‘Ease of Living.’ At 4:30 PM tomorrow, 2nd August, will launch e-RUPI, a futuristic digital payment solution which offers several benefits for its users. https://t.co/UpLgtBl1K3
— Narendra Modi (@narendramodi) August 1, 2021