OnePlus: స్మార్ట్‌ఫోన్ వాడే వారికీ ఈ పేరును పెద్దగా పరిచయం చేయక్కర్లేదు. కాకుంటే.. కాస్త ధర ఎక్కువ. గతంలో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కొనాలంటే.. దాని రేట్ ఎక్కువ.. అంత డబ్బు మనమెక్కడ పెట్టగలం అనేవారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని.. మరింత మందికి దగ్గర అవ్వాలనే ఉద్దేశ్యంతో.. వన్‌ప్లస్ సంస్థ ‘నార్డ్ సిరీస్’ ను తీసుకొచ్చింది. వన్‌ప్లస్ నార్డ్ సిరీస్ ధర రూ.20 నుంచి 30 వేల ఉండడంతో.. యూజర్స్ వన్ ప్లస్ కు బాగానే అట్ట్రాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో వినియోగదారులకు మరింత దగ్గరవ్వాలనే ఉద్దేశ్యంతో ఎంపిక చేసిన మోడళ్లపై 25 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది.
ఎవరైనా వన్‌ప్లస్ కంపెనీకి చెందిన స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని వేచి ఉంటే.. ఇదొక మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఆఫర్ చేస్తున్న మొబైల్స్ లో.. వన్‌ప్లస్ 10ప్రో 5జీ, వన్‌ప్లస్ 10ఆర్ 5జీ, నార్డ్ సీఈ 2 లైట్ 5జీ, వన్‌ప్లస్ 9 5జీ, వన్‌ప్లస్ 9ప్రో 5జీ వంటి మోడల్స్ ఉన్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ:
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ అసలు ధర రూ.19,999 గా ఉంది. కానీ, ప్రస్తుతం 5శాతం డిస్కౌంట్‌తో రూ.18,999 కి అందుబాటులో ఉంది. అలాగే.. కొనుగోలు సమయంలో క్రెడిట్ కార్డ్‌తో రూ. 1000 అదనపు తగ్గింపు లభిస్తుంది. 3 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
స్పెసిఫికేషన్స్:
వన్‌ప్లస్ 9 5జీ:
వన్‌ప్లస్ 9 5జీ అసలు ధర రూ.49,999 గా ఉంది. కానీ, ప్రస్తుతం 24శాతం డిస్కౌంట్‌తో రూ.37,999 కి అందుబాటులో ఉంది.
స్పెసిఫికేషన్స్:
వన్‌ప్లస్ 9ప్రో 5జీ:
వన్‌ప్లస్ 9ప్రో 5జీ అసలు ధర రూ.64,999 గా ఉంది. కానీ, ప్రస్తుతం 23శాతం డిస్కౌంట్‌తో రూ.49,999 కి అందుబాటులో ఉంది.
స్పెసిఫికేషన్స్:
వన్‌ప్లస్ 10ఆర్ 5జీ:
వన్‌ప్లస్ 10ఆర్ 5జీ అసలు ధర రూ.38,999 గా ఉంది. కానీ, ప్రస్తుతం 10శాతం డిస్కౌంట్‌తో రూ.34,999 కి అందుబాటులో ఉంది. రూ.3 వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.దీనితో పాటు వన్‌ప్లస్ బడ్స్ Z2ని కేవలం రూ.3,999కె సొంతం చేసుకోవచ్చు.
స్పెసిఫికేషన్స్:
వన్‌ప్లస్ 10ప్రో 5జీ:
ఈ మొబైల్ అసలు ధర రూ.66,999 గా ఉంది. కానీ, ప్రస్తుతం 7శాతం డిస్కౌంట్‌తో రూ.61,999 కి అందుబాటులో ఉంది. ఆఫర్లు ఇలా.. రూ.5 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, వన్‌ప్లస్ బడ్స్ Z2ని కేవలం రూ.2,999, వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ ప్రోను కేవలం రూ.5,999.
స్పెసిఫికేషన్స్:
ఇదీ చదవండి: Nothing Phone 1: క్రేజ్ పెరిగాక.. నథింగ్ ఫోన్ కు పెరిగిన రేటు.. ఎంతంటే?
ఇదీ చదవండి: Moto Razr 2022: మోటోరోలా సరికొత్త రికార్డు.. 5 నిమిషాల్లో 10 వేల బుకింగ్స్!