Nothing Phone (1): నథింగ్ బ్రాండ్ ఇటీవల స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అదే నథింగ్ ఫోన్ (1). ఈ ఫోన్ విషయంలో ఇప్పటికే ఎన్నో నాణ్యతా పరమైన సమస్యలు వచ్చినట్లు నెటిజన్లు కంప్లైంట్ చేశారు. వినియోగదారులకు స్టేబుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి కొన్ని అప్డేట్స్ కూడా అందించింది కంపెనీ. ముఖ్యంగా ట్రాన్స్‌ప్రంట్ బ్యాక్ ప్యానెల్ డిజైన్ మొబైల్ ప్రియులను బాగా ఆకట్టుకుంది. దీంతో సేల్స్ పరంగాను మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో నథింగ్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే.. అది అప్డేట్ గురుంచి మాత్రం కాదు.. నథింగ్ ఫోన్ రేటు గురుంచి. ట్రాన్స్‌ప్రంట్ బ్యాక్ ప్యానెల్ దానికి గ్లిఫ్ ఇంటర్ఫేస్తో కూడిన ఎల్ఈడీ స్ట్రిప్ లైట్స్. ఇంతకు ముందు ఏ ఫోన్లోనూ ఇలాంటి లైట్స్ సెటప్ లేదు. మొత్తంగా 900 ఎల్ఈడీలను ఈ స్ట్రిప్స్లో నథింగ్ పొందుపరిచింది. కాల్ వచ్చినప్పుడు, చార్జింగ్ పెట్టినప్పుడు, నోటిఫికేషన్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు బ్యాక్ ప్యానెల్‌పై లైట్స్ బ్లింక్ అయితే చాలా కొత్తగా అనిపిస్తుంది. అందులోనూ లుక్పరంగా చాలా ఆకర్షణీయంగా ఫ్లాట్ ఎడ్జెస్ ఉండడంతో చూసేందుకు యాపిల్ ఐఫోన్‌ను తలపించింది. ఈ తరుణంలో నథింగ్ ఫోన్ 1కు మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో నథింగ్ కంపెనీ ఫోన్ ధరను కంపెనీ రూ.1,000 మేర పెంచింది. ఈ నిర్ణయంతో.. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999కు, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.36,999కు, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999కు పెరిగింది. నథింగ్ ఫోన్ (1) స్పెసిఫికేషన్స్: 6.55 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లే+ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ క్వాల్కం స్నాప్ డ్రాగన్ 778జీ ప్లస్ చిప్ సెట్ ఓఎల్ఈడీ డిస్ప్లే ప్యానల్ వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ (50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 766 + 50 ఎంపీ శాంసంగ్ జేఎన్1 ఆల్ట్రా వైడ్) 16 ఎంపీ సోని ఐఎంఎక్స్ 471 ఫ్రంట్ కెమెరా అండర్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్ 4,500ఎంఏహెచ్ బ్యాటరీ 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ 15డబ్ల్యూ క్యూఐ వైర్లెస్ ఛార్జింగ్ View this post on Instagram A post shared by Nothing (@nothing) ఇదీ చదవండి: Vivo: ఊసరవెల్లిలా రంగులు మార్చే స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసిన వివో.. ధర, ఫీచర్స్ ఇవే! ఇదీ చదవండి: ఈ చైనా స్మార్ట్ఫోన్లు వాడుతున్నారా? అయితే, జాగ్రత్త.. లేదంటే మీ ఖాతా ఖాళీ.!