‘ఎక్కడ పోయిందో.. అక్కడే రాబట్టుకోవాలి’.. ఇదే నానుడితో ‘నోకియా‘ మరలా మొబైల్ రంగంలోకి ఎంట్రీ ఇస్తోంది. వినూత్నమైన ఫీచర్ తో విదేశీ కంపెనీలను తలదన్నేలా రంగప్రవేశం చేస్తోంది. తాజాగా హెచ్ఎండీ గ్లోబల్ రివీల్ చేసిన ‘నోకియా 5710 ఎక్స్‌ప్రెస్ ఆడియో రిలీజ్‘ డిజైన్ అందుకు నిదర్శనం. ఈ వినూత్నమైన ఫీచర్ మొబైల్ ప్రియులను చూడగానే ఆకట్టుకుంటోంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో.. ట్రూవైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను ఇన్‌బిల్ట్‌గా అందించడాం విశేషం.
నోకియా 5710 ఎక్స్‌ప్రెస్ ఆడియో ధర
ఈ ఫోన్ ను ఫిన్ ల్యాండ్ లో లాంచ్ చేసారు. దీని ధర 74 యూరోలుగా (సుమారు రూ.5,950) నిర్ణయించారు. జులై 28 నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది. మనదేశంలో అక్టోబర్ లో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ధర రూ. 7,000 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మనదేశంలో నోకియా 105, నోకియా 105 ప్లస్ ఫీచర్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
స్పెసిఫికేషన్స్:
ఇందులో 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లేను అందించారు. యూనిసోక్ టీ107 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ర్యామ్ 48MB ఉండగా ఎక్సటర్నల్ స్టోరేజ్ 128 ఎంబీగా ఉంది. ఎక్సటర్నల్ స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 32 జీబీ వరకు పెంచుకోవచ్చు.
దీని బ్యాటరీ సామర్థ్యం 1450 ఎంఏహెచ్‌గా ఉంది. వీజీఏ కెమెరా కూడా ఈ ఫోన్‌లో ఉంది. డ్యూయల్ సిమ్‌లను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఫోన్ వెనకవైపు టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్‌ను హైడ్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ ఈ మొబైల్‌కు పెద్ద ప్లస్ పాయింట్. ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: OnePlus: వన్‌ప్లస్ 10ఆర్ 5జీపై బంపరాఫర్.. ఏకంగా రూ. 4,000 డిస్కౌంట్!
ఇది కూడా చదవండి: boAt: ‘లైవ్ క్రికెట్ స్కోర్’ ఫీచర్ తో boAt స్మార్ట్‌వాచ్.. ధర ఎంతంటే?