వేసవి కాలంలో ఎండ వేడి ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకించి వర్ణించాల్సిన అవసరం లేదు. వేడి నుంచి ఉపశమనం కోసం ఏసీ, కూలర్, ఫ్యాన్‌ను ఆశ్రయిస్తాం. దాంతో కరెంట్ బిల్లు విపరీతంగా వస్తుంది. మరి ఈ సమస్యకు పరిష్కారమే.. కొత్త మోడల్ ఏసీ. ఆ వివరాలు..
టైటిల్ ఎండలు మండి పోతున్నాయి. ప్రతి ఏడాది ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి తప్పితే తగ్గడం లేదు. ఇక మే నలలో వచ్చే ఎండల గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. ఉదయం 8-9 గంటల నుంచే భానుడి ప్రతాపం మొదలవుతోంది. ఇక 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విపరీతమైన ఉక్కపోత. కాసేపు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు పని చేయకపోయినా.. వేడి పోయ్యి మీద కూర్చున్న ఫీలింగ్ వస్తోంది. దాంతో ఇండ్లు, ఆఫీసులు అనే తేడా లేకుండా 24 గంటలు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు తిరుగుతూనే ఉన్నాయి. దాంతో కరెంట్ బిల్లు కూడా విపరీతంగా వస్తుంది. ఇక వేసవిలో ఏసీలు వినియోగించే వారి కరెంట్ బిల్ కష్టాల గురించి ఎంత వర్ణించినా తక్కువే. వేలల్లో బిల్లు వాచిపోతుంది. పోనీ ఏసీ ఆఫ్ చేద్దామా అంటే.. ఉక్కపోత తట్టుకోలేం. దాంతో తప్పని సరి పరిస్థితుల్లో వేలకు వేలు కరెంట్ బిల్లు కడుతున్నారు. కానీ ఇక మీదట ఆ బాధలు ఉండవు అంటున్నారు. కారణం 24 గంటలు వాడినా కరెంట్ బిల్ రాని ఏసీ మార్కెట్‌లోకి వచ్చింది. ఆ వివరాలు..
24 గంటలు వాడినా కరెంట్ రాని ఏసీలా.. అదేలా సాధ్యం అని ఆలోచిస్తున్నారా.. సోలార్ ఏసీలు పెట్టుకుంటే సాధ్యమే అంటున్నారు. ఈ సోలార్ ఏసీలు సూర్యరశ్మి నుంచి సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్ శక్తిపై పని చేస్తాయి. దీంతో కరెంటు బిల్లు బాధ నుంచి బయటపడవచ్చు. సాధారణ ఏసీని వాడితే.. చాలా విద్యుత్ ఖర్చు అవుతుంది. అంతేకాక దాని నిర్వహణ ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ సోలార్ ఏసీతో ఆ ఇబ్బుందులే ఉండవు. పైగా సాధారణ ఏసీ కంటే సోలార్ ఏసీలు పని చేయడానికి ఎక్కువ పవర్ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. సాధారణ ఏసీలు విద్యుత్ పై మాత్రమే పనిచేస్తాయి. సోలార్ ఏసీ సౌర శక్తి, సోలార్ బ్యాటరీ బ్యాంక్, విద్యుత్ ఇలా మూడు రకాలుగా పని చేస్తుంది.
మరి ఈ సోలార్ ఏసీ కోసం ప్రత్యేక మార్పులు ఏం చేయాలి అంటే..పెద్దగా ఏం లేదు. కేవలం మన ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ అమర్చుకోవాల్సి ఉంటుంది. సోలార్ ప్యానెల్లు పగటిపూట మాత్రమే పని చేస్తాయి. అలా ఉత్తత్తి అయిన మీరు బ్యాటరీల రూపంలో స్టోర్ చేసుకువచ్చు. ఇలా చేయడం ద్వారా.. రాత్రిపూట ఏసీలు నడవడానికి కావాల్సిన అదనపు విద్యుత్‌ని బ్యాటరీల ద్వారా పొందుతారు. అయితే.. సోలార్ ఏసీ ధర సాధారణ ఏసీ ధర కంటే ఎక్కువ. కానీ, సాధారణ ఏసీ స్థానంలో మీరు సోలార్ ఏసీని ఇన్ స్టాల్ చేస్తే మీ విద్యుత్ బిల్లు జీరో అవుతుంది. ఒపెన్ మార్కెట్‌లోనే కాకుండా ఆన్‌లైన్‌లో కూడా ఈ సోలార్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి.
సోలార్ ఏసీని అమర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది పనిచేయడానికి విద్యుత్‌ను వినియోగించాల్సిన అవసరం ఉండదు. దాంతో మీకు కరెంట్ బిల్ బాధ తగ్గుతుంది. ఈ ఏసీ ఆటో స్టార్ట్ మోడ్, టర్బో కూల్ మోడ్, డ్రై మోడ్, స్లీప్ మోడ్, ఆన్-ఆఫ్ టైమర్, ఆటో క్లీన్, స్పీడ్ సెట్టింగ్, లవర్ స్టెప్ అడ్జస్ట్, రిమోట్‌లో గ్లో బటన్ వంటి సాధారణ ACలో మీరు పొందే అన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది. ఖరీదు కాస్త ఎక్కువ అయినా.. ఒక్కసారి ఫిట్ చేసుకుంటే.. కరెంట్ బిల్లు కష్టాలు తప్పుతాయి. మరి ఈ సోలార్ ఏసీపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.