స్మార్ట్ కొనుక్కోవాలి అని అందరికీ ఉంటుంది. కానీ, చాలామందికి ఫోన్ కొనుక్కునే స్థోమత ఉండకపోవచ్చు. అలాంటి వారి కోసం మార్కెట్లో కొన్ని బడ్జెట్ ఫోన్స్ ఉన్నాయి. వాటిలో అచ్చు ఐఫోన్ లుక్స్ లో ఉన్న స్మార్ట్ ఫోన్ ఒకటి మీకోసం తీసుకొచ్చాం.
స్మార్ట్ ఫోన్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. ఇప్పుడు అందరూ స్మార్ట్ ఫోనే కొనుగోలు చేయాలని చూస్తున్నారు. అందులోనూ మరీ ముఖ్యంగా ఐఫోన్ అంటే బాగా ఇష్టపడుతుంటారు. కానీ, ఐఫోన్ కొనడం అంత సామాన్యమైన విషయం కాదు కదా? పైగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారికి అది ఒక డ్రీమ్ అని చెప్పాలి. కానీ, ఇప్పుడు ఒక ఇండియన్ బ్రాండ్ ఐఫోన్ తరహా లుక్స్ లో ఒక ఫోన్ ని లాంఛ్ చేసింది. అది బ్యాక్ సైడ్ చూసేందుకు అచ్చు ఐఫోన్ మాదిరిగానే ఉంది. అది కూడా కేవలం రూ.7,999కే అందిస్తున్నారు. దీనికి ఇండియన్ ఐఫోన్ అనే పేరు కూడా వచ్చింది. మరి.. ఆ ఫోన్ ఫీచర్స్ ఏంటో చూద్దాం.
ఇండియాకు చెందిన లావా కంపెనీ ఈ యువ 2 ప్రో మోడల్ ను తయారు చేసింది. దీనికి అతి కొద్ది సమయంలోనే మంచి డిమాండ్ వచ్చింది. ఎందుకంటే మరీ ముఖ్యంగా ఈ ఫోన్ లుక్స్ అనే చెప్పాలి. ఇది అచ్చు ఐఫోన్ మాదిరిగానే ఉంది. పైగా 3 కూల్ కలర్ వేరియంట్స్ లో దీనిని రిలీజ్ చేశారు. వైట్, పర్పుల్, గ్రీన్ కలర్స్ లో లావా యువ 2 ప్రోని విడుదల చేశారు. ఇందులో మరీ ముఖ్యంగా ఆకట్టుకునే విషయం ఏంటంటే.. దీని ధర. అవును ఈ ఫోన్ ని కేవలం రూ.7,999కే అందిస్తున్నారు. అంత తక్కువ ధరకు అందిస్తున్నారు కదా అని ఇది సాదాసీదా ఫోన్ అని అనేసుకోకండి. ఇందులో చాలా అదిరిపోయే ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ ఇది.
ఈ లావా యువ 2 ప్రో ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ మోడల్ సింగిల్ వేరియంట్ తో వస్తోంది. దీనిలో 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉంది. దీనికి అదనంగా 3 జీబీ వర్చువర్ ర్యామ్ కూడా అందిస్తున్నారు. 6.5 ఇంచెస్ హెచ్ డీ ప్లస్ నాట్చ్ డిస్ ప్లే ఉంది. ఇందులో కెమెరా విషయానికి వస్తే..13 ఎంపీ రేర్ కెమెరా, 5ఎంపీ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. మీరు రేర్- సెల్ఫీ రెండు కెమెరాలతో హెచ్ డీ క్వాలిటీతో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. దీనిలో హీలియో 37 ప్రాసెసర్ ని అమర్చారు. అంటే మీరు హెవీ గేమ్స్ ఆడటానికి ఈ ఫోన్ పని చేయదు. మీడియం రేంజ్ గేమ్స్ ని అయితే బాగానే హ్యాండిల్ చేయగలదు. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 10వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, ట్రాన్సపరెంట్ కేస్ కూడా ఇస్తున్నారు.
ఈ ఫోన్ ముఖ్యంగా లుక్స్ తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇందులో సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ ఉండటం మరో విశేషం. అలాగే లౌడ్ స్పీకర్స్ కూడా ఉన్నాయి. బడ్జెట్ లో అదీ రూ.10 వేలలోపే స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఈ లావా యువ2 ప్రో బెస్ట్ ఆప్షన్ అని టెక్ నిపుణులు సైతం చెబుతున్నారు. ఈ యువ 2 ప్రో కంటే ముందు లావా కంపెనీ యువ ప్రో అనే మోడల్ రిలీజ్ చేసింది. దాని ధర రూ.7,799గా నిర్ణయించింది. దానిలో 3+32 వేరియంట్ ఒకటే విడుదల చేశారు. దీనిలో కూడా సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 13 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్స్ ఉన్నాయి. ఈ లావా యువ ప్రో మోడల్ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
Lava Yuva 2 Pro launched in India.
Price : ₹ 7,999
• 6.5″ HD+ LCD
• Helio G37
• 13MP rear, 5MP🤳
• USB C, Android 12
• 5000mAh🔋, 10W chargingAll is good, but remember some Gionee and LeTV phones have this cheap design 😅 pic.twitter.com/gewPPxKAhI
— Debayan Roy (Gadgetsdata) (@Gadgetsdata) February 21, 2023