కొత్త బైక్ కొనాలనుకునేవారికి శుభవార్త. డిస్కౌంట్ కోసం ఎదురుచూసే బైక్ ప్రియులకు బైక్ తయారీ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. 300 సీసీ బైకులపై భారీ తగ్గింపును ప్రకటించాయి.
కార్ల కంటే యువత ఎక్కువగా ఇష్టపడేది బైకే. స్పోర్ట్స్ మోడల్ బైకులు, క్రూజర్ బైకులు వంటివి బాగా ఇష్టపడతారు. బైక్ మీద రయ్ రయ్ మని పోతుంటే వచ్చే ఆ కిక్కే వేరు అని ఫీలవుతా ఉంటారు. ప్రస్తుతం మార్కెట్లో చాలానే బైక్ మోడల్స్ ఉన్నాయి. అయితే మైలేజ్ ఇచ్చే బైకుల కంటే మైలేజ్ ఇవ్వకపోయినా స్టైలిష్ గా ఉండే బైకుల పట్ల యువత ఆకర్షితులవుతారు. కొంటే అలాంటి బైకులనే కొనాలని కలలు కంటూ ఉంటారు. అయితే బైక్ మీద ఏదైనా తగ్గింపు ఉంటే కొనాలని కొందరు ఆగిపోతూ ఉంటారు. అలాంటి వారికి గుడ్ న్యూస్. నేకెడ్ స్ట్రీట్ వెర్షన్ బైక్, ఫుల్లీ ఫెయిర్డ్ రేజింగ్ బైకులను ఇష్టపడే వారి కోసం ఈ కంపెనీ భారీగా ధరలను తగ్గించింది.
కీవే ఇండియా కంపెనీ తాజాగా 300 సీసీ బైకుల ధరను భారీగా తగ్గించింది. కే300 ఎన్, కే300 ఆర్ మోడళ్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. కీవే కంపెనీ హంగేరీ కేంద్రంగా ద్విచక్రవాహనాలను తాయారు చేస్తోంది. గత ఏడాదిన భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కంపెనీ ఆదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా ఆధ్వర్యంలో వ్యాపారం కొనసాగిస్తోంది. ప్రస్తుతం కీవే కంపెనీ 98 దేశాల్లో తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది. వివిధ రకాల ప్రీమియం స్కూటర్లు, బైకులను తయారు చేస్తోంది. వీస్టే 300 మ్యాక్సీ స్కూటర్, సిక్స్టీస్ 300ఐ రెట్రో స్కూటర్, కేలైట్ 250వీ క్రూజర్ బైక్, కే 300 బైకులను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే వీటి ధరలు లక్షల్లో ఉన్న కారణంగా కొనేందుకు యువత ముందుకు రావడం లేదు.
దీంతో కంపెనీ ఈ మోడళ్లపై భారీగా ధర తగ్గించింది. నేకెడ్ స్ట్రీట్ వెర్షన్ కే 300 ఎన్ బైక్ కొనాలంటే రూ. 2.65 లక్షల నుంచి రూ. 2.85 లక్షల వరకూ ఉంటుంది. అలానే ఫుల్లీ ఫెయిర్డ్ రేజింగ్ స్పోర్ట్స్ మోడల్ కే 300ఆర్ ధర రూ. 2.99 లక్షల నుంచి రూ. 3.2 లక్షల వరకూ ఉంది. కే 300 ఎన్ మోడల్ పై రూ. 30 వేల డిస్కౌంట్ ప్రకటించింది కంపెనీ. దీంతో ఈ బైక్ కేవలం రూ. 2.55 లక్షలకు లభిస్తుంది. అలానే కే 300ఆర్ పై రూ. 55 వేల వరకూ తగ్గించింది. దీంతో ఈ బైక్ రూ. 2.65 లక్షలకు లభిస్తుంది. దీంతో యువత కొనేందుకు ముందుకు వస్తారని కంపెనీ భావిస్తోంది. మరి భారీగా ధరలు తగ్గించడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.