Jio 5G Phone: టెలికాం రంగంలోకి ‘రిలయన్స్ జియో‘ అడుగుపెట్టాక సృష్టించిన అలజడి అంతా.. ఇంతా కాదు. ఆ రంగం రూపురేఖలే మారిపోయాయి. ప్రారంభంలో ఏడాది పాటు అన్ని సేవలు ఫ్రీ అంటూ.. ఇతర ఆపరేటర్ల పరిథిలోని వినియోగదారులను సైతం తనవైపుకు మళ్లించుకోగలిగింది. ఫలితంగా దేశంలో టెలికాం సేవలు అందిస్తున్న సంస్థల్లో అగ్రస్థానానికి చేరిపోయింది. ఆ తరువాత కూడా తక్కువ ధరలకే టారిఫ్‌లు తీసుకొస్తూ సామాన్యులకు సైతం అందుబాటులో ఉంటోంది. ఇక ఇప్పటికే. ఫీచర్ ఫోన్లు, 4జీ ఫోన్లతో వినియోగదారులకు దగ్గరైన జియో.. మరో సంచలనానికి సన్నద్ధమవుతోంది. కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు యోచిస్తున్నట్టు సమాచారం.
దేశంలో 5జీ నెట్‌వర్క్ కవరేజ్‌కు సంబంధించిన ప్లానింగ్‌ను జియో పూర్తి చేసుకుందని, తొలిదశలో 13 నగరాల్లో 5జీని ప్రారంభిస్తుందని ఆండ్రాయిడ్ సెంట్రల్ నివేదికలో వెల్లడైంది. ఇందులో భాగంగానే జియోఫోన్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. 5జీ ధర రూ.10వేలలోపే ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో భారత్‌లో అత్యంత చౌకైన 5జీ మొబైల్ ఇదే కానుంది. గత ఏడాది రిలయన్స్ జియో , గూగుల్ సంయుక్తంగా జియో ఫోన్ నెక్స్ట్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇపుడు ఆగష్టు 29న జరగనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వార్షిక సాధారణ సమావేశంలో ఈ 5 జీస్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయవచ్చని అంచనా..
ధర(అంచనా)
5జీ జియో ఫోన్ ధర 10వేల నుంచి 12 వేల రూపాయల లోపే ఉండనుందట. అలాగే జియో ఫోన్ నెక్స్ట్ మాదిరిగానే, వినియోగదారులు రూ. 2500 డౌన్ పేమెంట్ చేసి ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చని వార్తలొస్తున్నాయి. గతంలో లాగానే ఈఫోన్ కొనుగోలు చేసినవారికి అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు ఇతర బంపర్ ఆఫర్లను అందించనుందట జియో. ఈ వివరాలన్ని అధికారంగా ప్రకటించేంతవరకు వేచిచూడక తప్పదు.!
Jio Phone 5G will be the Cheapest 5G phone! #Jio #Jiophone5G #Cheapest5G pic.twitter.com/EDtR2PduEl
— Smartprix (@Smartprix) August 10, 2022
జియో 5జీ ఫోన్ స్పెసిఫికేషన్స్(అంచనా)
అయితే 5జీ ఫోన్‌ను రిలయన్స్ జియో ఎప్పుడు విడుదల చేస్తుందన్నదానిపై స్పష్టత రాలేదు. ఈ సంవత్సరం రెండో అర్ధభాగంలో జియోఫోన్ 5జీ విడుదలయ్యే అవకాశాలు ఎక్కువుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్ రూపకల్పన దశలో ఉంది. ఈ ఫోన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Jio Independence Day Plan: ఇండిపెండెన్స్ డే కానుక.. జియో కొత్త రీఛార్జ్ ప్లాన్ లాంచ్.. వివరాలివే!
ఇదీ చదవండి: OnePlus Foldable Phone: భిన్నంగా వన్‌ప్లస్ ‘ఫోల్డబుల్ ఫోన్’.. డిజైన్ రెవీల్ చేసిన ‘పీట్ లా’!