స్మార్ట్ ఫోన్, యాప్స్ వాడటం అనేది ఇప్పుడు సర్వసాధారణమైన విషయం. అయితే ఈ ఫోన్- యాప్స్ వల్ల మీ గోప్యత దెబ్బతింటోంది అని ఎప్పుడన్నా ఆలోచించారా? మీరు ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఉంటే యాడ్స్ మాత్రమే మీ సోషల్ మీడియా ఖాతాలో కనిపిస్తాయి. అది ఎప్పుడన్నా గమనించారా? అలా ఎందుకు జరుగుతోంది? అనే ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఎందుకంటే మీరు ఏ టైమ్‌కి ఎక్కడ ఉన్నారు అనేది మీ ఫోన్ ద్వారా తెలుసుకుంటారు కాబట్టి. అవును మీరు మీ లొకేషన్ యాక్సెస్ ఏదొక యాప్ కి ఇచ్చే ఉంటారు. దాని ద్వారా మీరు ఎక్కడ ఉన్నారు అనేది ఇట్టే తెలిసిపోతుంది. మీకు ఆ చుట్టుపక్కల్లో ఉన్న యాడ్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి.
మీరు ఈ మధ్య కాలంలో చాలా లోన్ యాప్స్ కష్టాలు చూసుంటారు. అప్పు తీసుకున్న పాపానికి వడ్డీ, చక్రవడ్డీ వేసి కట్టలేకపోతే వారి కాంటాక్ట్ నంబర్లకు బెదిరింపు మెసేజ్ లు, మార్ఫింగ్ చిత్రాలు పంపి వేధింపులకు గురి చేశారు. వాళ్లు యాప్ డౌన్లోడ్ చేసుకునే సమయంలో అన్ని కాంటాక్ట్స్, ఫొటోలు, లొకేషన్ అన్నింటింకి పర్మిషన్ ఇవ్వడం వల్లే లోన్ యాప్స్ వాళ్ల అలా చేయగలిగారు. ఎందుకంటే మన ఫోన్ లో ఫొటోలు, లొకేషన్, కాంటాక్ట్స్ ఎందుకు అన్ని యాప్స్ కి ఇవ్వాలి? మీరు వాటిని యాక్సెస్ చేసే అనుమతి ఇస్తున్నారు అంటే అవి ఎంతో నమ్మదగిన యాప్స్ అయ్యి తీరాలి. అలా కాకుండా నచ్చిన యాప్స్ యాక్సెస్ ఇస్తూపోతే ఎన్నో అనర్థాలు ఎదురవుతాయి. అంతేకాకుండా మీ వ్యక్తి గోప్యత ప్రమాదంలో పడినట్లే.
చాలా యాప్స్ మీ లొకేషన్, ఫొటోలు, కెమెరా యాక్సెస్ కాంటాక్ట్స్ ని సమీక్షిస్తూ ఉంటాయి. ఆండ్రాయిడ్ యాప్స్ లో 75 శాతం వాటితో మీ ఫోన్ లొకేషన్ తెలుసుకోవచ్చు. 59 యాప్స్ అయితే మీరు వాటిని ఓపెన్ చేయకపోయినా కూడా మీ లొకేషన్ ని రివీల్ చేస్తుంటాయి. 57 శాతానికి పైగా ఫోన్లు మీ ఫోన్ మైక్రో ఫోన్ ని వాడుకుంటాయి. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే 76 శాతం యాప్స్ కి మీ కెమెరా యాక్సెస్ కూడా ఉంటుంది. 25 శాతం యాప్స్ అయితే మీ ఫింగర్ ప్రింట్ ని కూడా స్టోర్ చేసుకుంటాయి.
ఇంక ఎంతో సేఫ్ అనుకునే ఐవోఎస్ ఫోన్ యాప్ లు కూడా ఇలాంటివే. వాటిలో 83 శాతం యాప్స్ తో మీ లొకేషన్ ని తెలుసుకోవచ్చు. 81 శాతం యాప్స్ లో వాటిని వాడే సమయంలో కెమెరా యాక్సెస్ తీసుకోగలవు. ఇంకా ఘోరంగా 90 శాతం యాప్స్ లో అయితే మీ గ్యాలరీలోని ఫొటోలను బయట పెట్టేయగలవు. 64 శాతం యాప్స్ కి మైక్రోఫోన్ యాక్సెస్, 49 శాతం యాప్స్ లో కాంటాక్ట్ యాక్సెస్, 36 శాతం ఐవోఎస్ యాప్స్ తో క్యాలండర్ యాక్సెస్ ఉంటుందని బట్టబయలైంది. అర్కా కంపెనీ చేసిన ఒక సర్వేలో ఈ షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. అలాగే పిల్లలకు సంబంధించి యాప్స్ పై కూడా వీళ్లు సర్వే చేశారు. వాటిని డౌన్లోడ్ చేసుకునే సమయంలో మీరు ఇచ్చే అనుమతుల ద్వారా సమాచారం ఆయా సంస్థలకు చేరుతున్నట్లు గుర్తించారు.
వీటి నుంచి ఎలా బయటపడాలి? మీరు ఎప్పుడూ కూడా కొన్ని జాగ్రత్తలను ఫాలో అవ్వాలి. అలా అయితే మీరు మీ వ్యక్తిగత సమాచారం చోరీ కాకుండా ఆపగలరు. ముందు ఏ యాప్ ని అయినా కూడా మీకు తెలియని వెబ్ సైట్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోకండి. ఒక వేళ ట్రస్టెడ్ సోర్స్ నుంచి డౌన్లోడ్ చేసినా కూడా.. వాళ్ల ప్రైవసీ పాలసీ గురించి చదవండి. వాళ్లు అడుగుతున్న అనుమతులు ఆ యాప్ కి అవసరమా లేదా అనే విషయం కూడా తెలుసుకోవాలి. ముందు ఆ యాప్ గురించి మీకు పూర్తి తెలిసుండాలి. అవసరంలేని పర్మిషన్స్ కచ్చితంగా కావాలి అంటే మా యాప్స్ జోలికి మీరు పోకుండా ఉండటమే మంచిది. ఒకవేళ తప్పని పరిస్థుతుల్లో పర్మిషన్ ఇచ్చినా కూడా “వైల్ యూజింగ్” అనే ఆప్షన్ ని ఎంచుకోవాలి. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీ సమాచారాన్ని కాపాడుకోగలరు.