ఎలక్ట్రిక్ కారు, ఎలక్ట్రిక్ బైక్, ఎలక్ట్రిక్ స్కూటీలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా చేరాయి. ఇప్పటికే చాలా కంపెనీలు వీటిని తయారు చేస్తున్నాయి. గేర్ హెడ్ మోటార్స్ అనే సంస్థ తయారు చేసిన ఎలక్ట్రిక్ సైకిల్స్ కి భారత్ లో మంచి డిమాండ్ ఏర్పడింది.
ఎలక్ట్రిక్ వాహనాలకు ఎంతో డిమాండ్ పెరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం వల్ల చాలా మంది విద్యుత్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ బైక్, కారు, స్కూటీ అంటూ చాలానే మోడల్స్ వచ్చాయి. తాజాగా ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు విద్యుత్ సాయంతో నడిచే సైకిల్స్ ని తయారు చేశాయి. అయితే ఎలక్ట్రిక్ సైకిల్ ధరలు మరీ ఎక్కువగా ఉంటాయని అనుకుంటూ ఉంటారు. కానీ, గేర్ హెడ్ మోటార్స్ కంపెనీ మాత్రం తక్కువ ధరలోనే విద్యుత్ సైకిల్స్ ని అందిస్తోంది. అంతేకాకుండా దీనిలో మీ బడ్జెట్ ని బట్టి సైకిల్ రేంజ్, కెపాసిటీ కూడా మారుతుంది.
ఈ గేర్ హెట్ మోటార్స్ సాధారణ సైకిల్ ని ఎలక్ట్రిక్ సైకిల్ గా తయారు చేస్తోంది. చూడటానికి అవి నార్మల్ సైకిల్ లాగానే ఉంటాయి. కానీ, వాటిని ఛార్జ్ చేసిన తర్వాత విద్యుత్ సైకిల్ గా మారిపోతుంది. కావాలంటే మీరు సైకిల్ తొక్కుతూ కూడా ఎక్సలరేట్ చేసి స్పీడ్ గా వెళ్లచ్చు. ఈ కంపెనీ నుంచి మొత్తం 4 మోడల్స్ మార్కెట్ లోకి విడుదలయ్యాయి. వీటి ధర, మోడల్ ని బట్టి సైకిల్ కెపాసిటీ, రేంజ్ అనేది ఆధారపడి ఉంటుంది. వీళ్లు రిలీజ్ చేసిన 4 మోడల్స్ లో ఇప్పటికే రెండు బేస్ మోడల్స్ అవుట్ ఆఫ్ స్టాక్ గా నిలిచాయి. ఎక్కువ డిమాండ్ వల్ల రెండు మోడల్స్ అయిపోయాయి. వాటికి ప్రీ బుకింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.
ఈ ఎలక్ట్రిక్ సైకిల్ మోడల్స్ ధర విషయానికి వస్తే.. మోడల్ L ధర రూ.24,749గా ఉంది. మోడల్ I ధర రూ.28,799గా ఉంది. ఈ రెండు సైకిల్స్ స్పెసిఫికేషన్స్ ఒకటే. 25 కిలోమీటర్ల గరిష్ట వేగం, 2 గంటల ఛార్జింగ్ సమయం, 35 కిలోమీటర్ల రేంజ్ తో ఈ సైకిల్స్ వస్తున్నాయి. మోడల్, డిజైన్ విషయంలో మాత్రం మార్పు ఉంటుంది. ఈ రెండు వేరియంట్స్ ప్రస్తుతం స్టాక్ లో లేవు. ఇంకా.. మోడల్ F ధర రూ.45,999గా ఉంది. దీనిలో 5 కలర్ ఆప్షన్స్ వస్తాయి. ఇది 25 కిలోమీటర్ల టాప్ స్పీడ్, 60 కిలోమీటర్ల రేంజ్ తో వస్తోంది. ఛార్జ్ కి 3 గంటల సమయం పడుతుంది. మోడల్ E ధర రూ.49,999గా ఉంది. ఇది 25 కిలోమీటర్ల టాప్ స్పీడ్, 60 కిలోమీటర్ల రేంజ్ తో వస్తోంది. దీనిలో 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. గేర్ హెడ్ మోటార్స్ ఈ-బైక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.