ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయం సమీపిస్తోంది. సెప్టెంబర్ 23 నుంచి 30 వరకు 8 రోజుల పాటు సేల్ జరగనుంది. ప్లస్ మెంబర్లకు ఒకరోజు ముందుగానే డీల్స్ యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ తరుణంలో స్మార్ట్‌ఫోన్‌లతో పాటు మిగిలిన ప్రొడక్టులపై సేల్‌లో ఉండనున్న డిస్కౌంట్లు, ఆఫర్ల వివరాలను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తోంది.. ఫ్లిప్‌కార్ట్ . ఈ క్రమంలో సేల్‌లో శాంసంగ్ మొబైళ్లపై ఉండనున్న ఆఫర్లను వెల్లడించింది. వాటిలో కొన్ని ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇంతకు ముందెప్పుడూ లేని ధరలతో అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా కొన్ని పాపులర్ మోడల్స్‌పై బంపర్ ఆఫర్లు ఉంటాయి. అవేంటో చూద్దాం..
రూ. 84,999 ధర ఉన్న ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్22+ను రూ.59,999కే ఈ సేల్‌లో కొనుగోలు చేయవచ్చని ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌ను వెల్లడించింది. మంచి కెమెరా క్వాలిటీ, గేమింగ్ మొబైల్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే.. ఇదొక మంచి ఎంపిక.
స్పెసిఫికేషన్స్:
బిగ్ బిలియన్ డేస్‌లో రూ.31,999కే ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చని తెలిపింది. రూ. 74,499 ధరతో లాంచ్ అయిన ఎస్21 ఎఫ్ఈ 5జీ ధర ప్రస్తుతం రూ.49,999గా ఉంది. కార్డ్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ ఆఫర్ కలుపుకుంటే రూ.31,999కే ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.
స్పెసిఫికేషన్స్:
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ మొబైల్‌ను రూ.10,999కే సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ మొబైల్ సాధారణ ధర రూ. 23,999కాగా, 43% డిస్కౌంట్ తో రూ. 13,499 దరకు అందుబాటులో ఉంది. కార్డ్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ ఆఫర్ కలుపుకుంటే రూ.10,999కే ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. బడ్జెట్ రేంజ్‌లో శాంసంగ్ మొబైల్ కొనాలనుకుంటే.. ఈ డీల్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
స్పెసిఫికేషన్స్:
రూ. 14,999 ధరతో ఉన్న శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13ను ఈ సేల్‌లో రూ.8,499కే అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఫ్లిప్ కార్ట్ రివీల్ చేసింది.
స్పెసిఫికేషన్స్:
కొనుగోలుపై ఆఫర్లు:
బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై అదనపు డిస్కౌంట్ ఆఫర్లు ఉండనున్నాయి. శాంసంగ్‌తో పాటు యాపిల్, షావోమీ, రియల్‌మీ, వివో, ఒప్పో కంపెనీ ఫోన్‌లపై కూడా మంచి డిస్కౌంట్లు ఉండనున్నాయి. ప్రధానంగా నథింగ్ ఫోన్ 1, గూగుల్ పిక్సెల్ 6ఏ డీల్స్‌ను ఫ్లిప్‌కార్ట్ హైలైట్ చేస్తోంది. ఈ సేల్ లో నథింగ్ ఫోన్ 1 రూ. 28,999కు, గూగుల్ పిక్సెల్ 6ఏ రూ. 27,499 ధరకు అందుబాటులో ఉండనున్నాయి. మొత్తంగా ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫర్ల వర్షం కురిపించేందుకు ఫ్లిప్‌కార్ట్ సిద్ధమవుతోంది. ఈ సేల్ పై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.